Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ..

అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ..

by CVR NEWS
అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఏపీలో మరో పరిశ్రమకు పునాదిరాయి పడింది. అనకాపల్లి జిల్లాలో రెన్యూ సోలార్ ఎనర్జీ గ్లోబల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. రూ.5,400 కోట్లతో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు పనులకు భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి..అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లా అవుతుందన్నారు. భారీ పెట్టుబడులతో అనకాపల్లి దేశంలోనే నంబర్ వన్‌గా తయారవుతుందన్నారు. ఇక తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయాలన్న ముఖ్యమంత్రి..మనకు కావాల్సిన కరెంట్‍ను మనమే ఉత్పత్తి చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకోవాలని..అందుకు రాయితీ కూడా ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగాయని..అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎలాంటి ఆటంకం కలగకుండా రైతులకు 9గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. ఇక ఏపీకి ఇప్పటికే రూ.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు చంద్రబాబు.

Advertisements

You may also like

Our Visitor

023147
Total views : 141206

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.