కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం..అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని.. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు.
సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక..బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ.419 కోట్ల నుంచి…రూ.2,184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు.
Politics
మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, BRS ఎమ్మెల్యే అభ్యర్థి వాకి GBటి సునీతా లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ శ్రేణులు బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసింది, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసిఆర్‌ది గిరిజనుల అభ్యున్నతికై బిఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని, కాంగ్రెస్ బిజెపిలు వచ్చి రాజకీయం చేస్తే నమ్మకం అని సూచించారు సత్యవతి రాథోడ్. లోకబాజీ మాటలతో మహిళలను మాటల గారడి చేయడానికి చూస్తున్నారు బిజెపి కాంగ్రెస్‌లు వారి మాటలను నమ్మకండి అని గిరిజనుల అభివృద్ధికై అహర్నిశలు పాటుపడుతున్న సునీత లక్ష్మారెడ్డి ని గెలిపించాలని వారు కోరారు.
Read Also..
హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల మాదిరిగా మాటలకే పరిమితమవకుండా జిల్లా అభివృద్ధిలో జగన్ మార్క్ కనిపిస్తుందని చెప్పారు. దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో బొడ్డవర సమీపంలో ఎస్ ఈ జెడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని దీని ద్వారా మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు జిల్లాకు రావటం వల్ల జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఒక్క వైకాపా ప్రభుత్వానిదే అని చెప్పారు…
గోషామహల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాజా సింగ్ దూల్పేట్ లోని ఆకాశపురి దేవాలయం వద్ద పూజ అనంతరం తన అభిమానులు మరియు కార్యకర్తలతో కలిసి లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బైక్ ర్యాలీ గా బయలుదేరారు. ఆయనతోపాటు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఉదయం అబిడ్స్ లోనే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు అనంతరం రెండవసారి అభిమానులతో అబిడ్స్ కు బయలుదేరారు.
Read Also..
చేవెళ్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రచారం జోరు అందుకున్నది ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతి వాడవాడ తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ ప్రచారం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతోనే ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టు కాలే యాదయ్య తెలిపారు..
Read Also..
దేవరకొండ శాసనసభ నియోజకవర్గ స్థానం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయన వెంట బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Read Also..
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం… కడప జిల్లా కాశినాయన జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి పోరుమామిళ్ల వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు బయలుదేరారు. సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. పెద్దపల్లి నియోజకవర్గం లో ఆర్వో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు అన్ని సిద్దం చేశారు.ఆర్వో కార్యాలయాల వద్ద నామినేషన్ దాఖలు చెయ్యడం కోసం సందేహాలను నివృత్తి చెయ్యడం కోసం ఆయా కేంద్రాలలో హెల్ప్ డెస్క్ లకు ఏర్పాటు చేశారు. అలాగే ఆర్వో కార్యాలయాల పరిసర ప్రాంతాలలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు. కేంద్రాల చుట్టూ వంద మీటర్ల దూరం లో మార్క్ చేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి ఆర్వో కార్యాలయానికి బందోబస్తుని ఏర్పాట్లును పెద్దపల్లి డిసిపి Dr.చేతన మరియు ఎసిపి ఎడ్ల మహేష్ పరిశీలించారు.
గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు.. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు.. ఏ-1 గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమా.. మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ.. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఫిర్యాదు.. ఫ్రీ శాండ్ పాలసీ విధానం, అమలులో అవకతవకల పై సీఐడీ ఫోకస్.. ఉచిత ఇసుక పేరుతో సహజ వనరుల హద్దు లేకుండా అక్రమ తవ్వకాలకు ఆస్కారం ఇచ్చారని సీఐడీ అభియోగాలు..