నీటి యుద్ధం (Water war) : త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కిన వెంకట నరసింహ పురం కాలనీ వాసులు…
నీటి యుద్ధం (Water war) : గన్నవరం మండలం కేసరపల్లి గ్రామ పంచాయతీ వెంకట నరసింహపురం కాలనీ వాసులు త్రాగునీరు కోసం రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి నెలకొంది, గత 20 రోజుల నుండి కాలనీలో నీటి సమస్య ఉందని కేసరపల్లి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన కనీసం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని, మొక్కుబడిగా రోజుకు ఒక ట్రాక్టర్ ట్యాంకర్ పంపిస్తున్నారు ఇంటికి రెండు బకెట్లు నీళ్లు కూడా రావడం లేదు, మండుటెండలో నీళ్ల కోసం నాన్న ఇబ్బందులు పడుతున్నామని వెంకట నరసింహాపురం కాలనీవాసులు రోడ్లపైకి వచ్చి కేసరపల్లి సర్పంచ్ కార్యదర్శి ఇప్పటికైనా తమ గోడు విని తమకు త్రాగునీరు అందించాలని వేడుకుంటున్నారు.
ఇది చదవండి : కొవ్వూరు లో వింత ఘటన.. వేప చెట్టు నుంచి పాలు
కాలనీ వాసులు మాట్లాడుతూ….
నిత్యవసరమైన నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాము రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో రాత్రి సమయంలో అరగంట మాత్రమే పంచాయతీ నీటి కుళాయిల ద్వారా ఒకప్పుడు వచ్చాయి, ఇప్పుడు అవి కూడా రావడం లేదు. పంచాయతీ నీళ్లు కోసం తెల్లవారుజామున 3 గంటల వరకు నిద్రలు మానుకుని ఎదురుచూపులు చూస్తున్నాము. మండుటెండల సైతం లెక్కచేయకుండా జనాలు నీళ్ల కోసం రోడ్ల వెంబడి తిరగవలసిన పరిస్థితి నెలకొంది. గత 20 రోజులుగా గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కి చెప్పిన నీటి సమస్య తీర్చకుండా నిర్లక్ష్య వైఖరి గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డ్రమ్ము నీరు 25 రూపాయలు చెల్లించి బయట నుంచి కొనుక్కుని దాహార్తిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాయకులు అధికారులు స్పందించి మా నీటి దాహార్తిని తీర్చాలని కేసరపల్లి శివారు వెంకట నరసింహ పురం కాలనీవాసులు వేడుకుంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.
రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం… - పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి… - ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.
ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మండుటెండలో నీటి యుద్ధం…








Total views : 150822