రుచి అద్భుతంగా ఉండే చెరుకు రసంలో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్, కార్బొహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు చెరుకు రసం ద్వారా పొందొచ్చు. అందుకే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు. చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. చర్మానికి చెరుకు రసాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖంపై మొటిమలను తగ్గించడంలో చెరుకు రసం గ్రేట్‌గా సహాయపడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చెరుకు రసం మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే. క్రమంగా మొటిమలు మటుమాయం అవుతాయి. అలాగే చర్మ కాంతిని రెట్టింపు చేయడంలోనూ చెరుకు రసం ఉపయోగపడుతుంది.ఒక బౌల్లో చెరుకు రసం మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి. నెమ్మదిగా మసాజ్ చేయాలి.బాగా డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే. ముఖం కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది. ఇక చెరుకు రసాన్ని ముఖానికి డైరెక్ట్‌గా అప్లై చేసి.నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు వేళ్లతో మెల్ల మెల్లగా మసాజ్ చేసుకోవాలి.ఆ తర్వాత పావు గంట పాటు వదిలేసి. అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.చర్మంపై ముడతలు, సన్నని గీతలు పోయి ముఖం యవ్వనంగా, మృదువుగా మారుతుంది.
Antioxidants
చాలామంది రోజంతా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది. కంటి సమస్య ఎక్కువైన తర్వాత ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం. ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం. చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. బత్తాయి, నారింజ వంటి పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. మనం తీసుకునే ఆహారంలో టమాటాలను చేరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. టమాటాలలో మన కంటి చూపును కాపాడే లైకోపీన్ ఉంటుంది. ఈ ఆహారాలను కంటి చూపును మెరుగుపరచుకోవటం తీసుకోవటంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసేవారు గంటకో మారు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెయ్యటం మంచిది.కంటి ఆరోగ్యాన్ని బాదం పప్పు బాగా పెంచుతుంది. బాదం పప్పు నానబెట్టి నిత్యం రెండు పప్పులు తినటం కంటికి మేలు చేస్తుంది. గ్రుడ్లు, చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహరం. గ్రుడ్లలో జింక్, విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది.
Read Also..
Read Also..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. నేటి బిజీ ప్రపంచంలో చాలా మందికి ఉదయం తినడానికి కూడా సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో, చాలా మంది జ్యూస్ తాగడానికి ఇష్టపడతారు. అల్పాహారంతో పాటు దానిమ్మ రసం తాగడం కూడా చాలా మంచిది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలో దానిమ్మ సహాయపడుతుంది. రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ రసం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈ రసం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఫలకాలు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని నివారిస్తుంది మరియు గుండె జబ్బుల ముప్పును నివారిస్తుంది. క్యాన్సర్ నివారిస్తుంది దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా, ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించి, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రోజూ దానిమ్మ రసం తాగండి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ దానిమ్మ రసం తాగాలి. దానిమ్మలో కాంప్లెక్స్ బి విటమిన్లు ఉంటాయి. కీళ్లనొప్పులను నివారిస్తుంది దానిమ్మ రసంలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇది ఎముకలు మరియు కణజాలాలకు హానిని తగ్గిస్తుంది మరియు కీళ్ళలో వాపు సమస్య అయిన ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది. దానిమ్మ రసం కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా దానిమ్మ ఒక ప్రయోజనకరమైన పండు. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్స్ ఉంటాయి. ఇది చక్కెర జీవక్రియలో సహాయపడుతుంది.
టమాటలు వంటల్లో ఎక్కువగా వాడతాం. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులోని పోషకాలు శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ని తీసుకుంటే చాలా మంచిది. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి. టమాటో డైజెస్టివ్ ఎంజైమ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. టమాట జ్యూస్ జీర్ణ వ్యవస్థకి హెల్ప్ చేస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగితే ప్రేగు కదలికలు బావుంటాయి. మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది. ఖాళీ కడుపుతో జ్యూస్ తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ సహా విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునేవారు ఖాళీ కడుపుతో టమాట జ్యూస్ తాగితే మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది. దీంతో ఎక్కువ కేలరీలు తీసుకోకుండా హెల్ప్ చేస్తుంది. టమాట జ్యూస్ మంచి డీటాక్సీ ఫైయర్. ఇది బాడీ నుండి విషాన్ని బయటికి పంపుతుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే డీటాక్సీఫై అవుతుంది. జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తుంది. ఆరోగ్యకరమైన ప్రేగులని ప్రోత్సహిస్తుంది.
Read Also..
Read Also..
జీలకర్ర అనేది ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఇది యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు మరియు ముఖ్యమైన నూనెలతో సహా అనేక పోషకాలకు మంచి మూలం. జీలకర్రను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, జీలకర్రలో ఉండే థైమోల్ అనే యాంటీఆక్సిడెంట్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలోను, యాంటీఆక్సిడెంట్లు మరియు ముఖ్యమైన నూనెలు శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీలకర్రను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. దీన్ని వంటల్లో ఉపయోగించవచ్చు, లేదా జీలకర్ర నీరు, జీలకర్ర పొడి లేదా జీలకర్ర టీ వంటి రూపాల్లో తినవచ్చు. జీలకర్రను తినడం సురక్షితమైనది, అయితే ఎక్కువగా తీసుకుంటే కొన్ని ప్రతికూల ప్రభావాలు సంభవించవచ్చు. జీలకర్రను ఎక్కువగా తీసుకుంటే కడుపు నొప్పి, వాంతులు, వికారం మరియు మలబద్ధకం వంటి సమస్యలు సంభవించవచ్చు. కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు జీలకర్రను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
చింతకాయలు, చింతపండు పులుపు. పులుపుతో కూడిన చింతకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చింతకాయలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. చింతకాయల నుంచి వచ్చే చింతపండుకి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి వున్నాయంటారు. చింతకాయలు గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తాయి. కాలేయ రక్షణ ప్రయోజనాలను అందిస్తుంది చింతపండు. చింతకాయలు సహజ యాంటీమైక్రోబయల్ ప్రయోజనాలను అందిస్తాయి. యాంటీ-డయాబెటిక్ ప్రభావాలు చింతపండు ద్వారా కలుగుతుంది. ఐతే చింతపండును అధిక మోతాదులో తీసుకుంటే వ్యతిరేక ఫలితాలిస్తుంది. మధుమేహం మందులతో పాటు చింతపండు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పడిపోతుంది.
కొబ్బరి నూనె హానికరమైన సూక్ష్మజీవుల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి చర్మంపై పెరిగే హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. మొటిమలు, ఫోలిక్యులిటిస్, సెల్యులైటిస్ వంటి చర్మ వ్యాధులు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. చర్మం కోసం కొబ్బరి నూనె పొడి, పగిలిన చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. తేమను బాగా నిలుపుకోవడంలో ఉపయోగపడుతుంది. పొడి చర్మానికి కొబ్బరినూనె మంచి మందు. కొబ్బరి నూనె మొటిమల చికిత్సలో సహాయపడుతుంది. ఈ నూనెలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను నివారిస్తాయి. ఇందులోని లారిక్, క్యాప్రిక్ యాసిడ్లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయగలవు. శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిలను పెంచే సామర్థ్యం కొబ్బరి నూనెకు ఉంది. కొబ్బరి నూనె చర్మం మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కొబ్బరి నూనె సహాయపడతాయి. చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి స్నానానికి ముందు లేదా తర్వాత అప్లై చేయవచ్చు. చలికాలంలో దీన్ని లిప్ బామ్‌గా కూడా ఉపయోగించవచ్చు.
కడుపు సమస్యలను నివారించడానికి కాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు కడుపు ఆమ్లం మరియు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అజీర్ణం, గుండెల్లో మంట మరియు ఇతర కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ప్రత్యేకించి, కాబేజీలోని క్రూసిఫెరస్ ఫైటోకెమికల్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలకు హాని కలిగించడంలో సహాయపడతాయి. కాబేజీలోని ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును కాబేజీలోని పాటోసటాన్ల అనే పోషకాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. కాబేజీలోని ఫైబర్ మరియు తక్కువ కేలరీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబేజీని వివిధ రకాలుగా తినవచ్చు. దీనిని సలాడ్లు, సూప్‌లు, స్టూలు, వేయించిన వంటకాలు మరియు ఇతర వంటకాలలో ఉపయోగించవచ్చు. కాబేజీ యొక్క ఔషధ ప్రయోజనాలను పొందడానికి, దానిని వారానికి కనీసం రెండుసార్లు తినడం మంచిది.
వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు’ అంటున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల చికెన్, మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరవాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. కాలేయం, చర్మం, కళ్లు, వెంట్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.
చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ధూమపానం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. సిగరెట్ లేదంటే బీడీ తాగడం వల్ల నికోటిన్ అనే పదార్ధం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కసారి పొగతాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసినా ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగతాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు, ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గించగలవనే విషయాన్ని గుర్తించుకోవాలి. యాపిల్స్ లో చాలా పోషకాలుంటాయి. ఇందులో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనామ్లజనకాలు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడగలవు. మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు. మీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లోని నికోటిన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. వెల్లుల్లిలోయాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడగలదు. దానిమ్మలోనూ యాంటీఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి. దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది. దానిమ్మను పండు తిన్నా దాంతో జ్యూస్ చేసుకుని తాగినా చాలా ప్రయోజనాలుంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, సీ, కే, బీ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే నికోటిన్ ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ధూమపానం చేసే వారు రోజూ క్యారెట్ తినడం చాలా మంచిది. అలాగే కాలీఫ్లవర్, కాలే, టర్నిప్, క్యాబేజీ వంటి కూరగాయాలతో తయారు చేసిన పదార్థాలను తరుచుగా తింటూ ఉంటే మీ ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం అంతగా ఉండదు. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడగలదు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించగలదు. నికోటిన్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి. అందువల్ల తరుచుగా గ్రీన్ టీ తాగుతూ ఉండండి.




Total views : 141491