ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మహమ్మద్ అలీ మాట్లాడుతూ…. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. షాదీ ముబారక్ తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతనిస్తున్నారని,
మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లు పరిపాలించినా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసారని, వారి సంక్షేమం కోసం కృషి చేయలేదన్నారు.పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ముస్లిం మైనారిటీలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
dasari manohar reddy
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులకు మూడోసారి భంగపాటు తప్పదని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో గడప గడపకు వెళ్లి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు ఎలా వేస్తారన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయడం ఖాయమని, పెద్దపల్లి నియోజవర్గంలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినా 60 గ్యారంటీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పథకాలను కేసీఆర్ అందిస్తున్న అందిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అండగా నిలవాలని అభ్యర్థించారు.





Total views : 141170