టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు కు చెందిన తెదేపా నేత చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు. టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంది అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు, వైసీపీ నాయకుల దాడులు చూస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు. రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంను ప్రపంచ పటంలో చూపించగలరన్నారు.
jagan mohan reddy
కాకినాడ రూరల్ విద్యుత్ నగర్ వెంకన్నబాబు కళ్యాణ మండపం లో కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జే.ఏ.సి కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు, కాపు జే.ఈ.సి మెంబర్ లు అర్. ప్రకాష్, ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు కులస్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు కార్యచరణ చేయటం లేదని, కాపు లకి రిజర్వేషన్ కల్పించే విధంగా పోరాటం చేయవల్సిన అవసరం ఉందన్నారు. వై.ఎస్. జగన్ అధికారం లో కి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ కి ప్రతి ఏటా 2000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 5 సంవత్సరాలకు కలిపి 10000 కోట్లు ఇవ్వాల్సి ఉందనీ, జగన్ కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండ ఎన్నికలకు వెళ్తే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. జనవరి 3 వ తేదీన విజయవాడ లో కాపు, ఒంటరి, బలిజ, కులాల జేఏసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జేఏసి కార్యవర్గ సభ్యులు ఉన్నారని వారి వారి పరిధిలో ఆక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని, రాబోయే కాపు తరాల కోసం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాపు సభావన సంగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా, రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా చీమకుర్తి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి YS జగన్ మోహనరెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఈ నెల 26వ తేది నుండి చీమకుర్తి మున్సిపాలిటీ లో నిరవధిక సమ్మె జరుపుతున్నారు, ఇందు వలన చీమకుర్తి వీధులలో పేరుకుపోయిన చెత్త, అసలే కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ఎక్కడ చెత్త అక్కడే ఉండుట వలన వ్యాధులు ప్రభలే ప్రమాదం పొంచి ఉంది. కావున పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చితే, కార్మికులు అండగా నిలిచి గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతారు. లేనియెడల సమ్మె ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు భీమవరం వేదికగా విద్యా దీవెన నగదును బటన్ నొక్కి ఎనిమిది లక్షల తొమ్మిది వేలమంది విద్యార్థుల ఖాతాలో 584 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. జివిఆర్ జూనియర్ కళాశాల వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. సీఎం బహిరంగ సభ హెలిప్యాడ్ ప్రాంతాల ఏర్పాట్లను, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోహన్ రాజు, మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ పరిశీలించారు. సీఎం జగన్ పర్యటన నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుకట్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు గుంటూరు తాడేపల్లిగూడెం నుండి బయలుదేరి 10:45 నిమిషాలకు భీమవరం లూధరన్ గ్రౌండ్ హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన బహిరంగ సభ ప్రాంతానికి వస్తారని తెలిపారు. కావున సీఎం పర్యటనను నియోజకవర్గ ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 15వ రోజు అంగన్వాడీలు శ్రీకాకుళం నగరంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. 7 రోడ్ల కూడలి వద్ద ప్లేట్లు, గరిటలు పట్టుకొని మోత మోగిస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి మాట్లాడుతూ నిద్రాహారాలు మాని అనేక విధాలుగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైకరిని విడనాడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చర్చల పేరుతో కాలయాపన చేయకుండా కనీస వేతనం 26000 ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాచ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Read Also..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగ చిత్ర పటానికి, విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందుకే టిడిపిని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు టిడిపి ప్రభుత్వం రంగాను చంపిందని చంద్ర బాబే చంపాడన్నారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూసాడు కాని నన్ను చంపలేకపోయాడని నారాయణ అప్పట్లో అన్నారు. పదవే శాశ్వతమా, పదవి కోసం పాకులాడాలా, పదవి కోసం పాకులాడే వారిని ఈ సమాజం క్షమించకూడదని కన్నాని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి వెంబడి నడిచాను ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంబడే నడిచాను అని అన్నారు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా. జగన్ ను జైల్లో పెడతానన్నారు అలాగే నన్ను కూడా జైల్లో పెడతారు అన్నారు. సిబిఐ కూడా నన్ను పిలిచింది అయినా నేను నమ్ముకున్న మనిషి కోసం సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాను.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహిస్తున్న “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంబించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడుకు సిఎం చేరుకుంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సిఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోటీలు మొదలవుతాయి. డిసెంబర్ 26 నుంచి 2024 ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 47 రోజులపాటు ఐదుదశల్లో ఈ పోటీలు జరుగుతాయి. సిఎం జగన్ పర్యటన దృష్ట్యా భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Read Also..
అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న నిరసన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు యేసుప్రభు చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఏపీ సీఎం జగన్ మనసు మార్చి మా జీతాలు పెంచేలా చూడాలని యేసుప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీసం రూ.26,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరసన సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే చూస్తు ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని, బ్రాందీ షాపు వద్ద కాపలా పెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడి మహిళలు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెలో చింతమనేని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. జగన్ కు దమ్ముంటే రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. పోలీసులు, గన్ మెన్లు లేకుండా కనీసం బయటకు రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడన్నారు. ముఖ్యమంత్రి పాపం పండిందని, ప్రజలు ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని చింతమనేని తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరులో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లను వారు తొలగించి విద్యార్థులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితిని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.





Total views : 140791