2004లో రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బూర్గంపాడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును, గుణాన్ని చూడాలన్నారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర, వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? పేదలు, రైతుల పట్ల వారి తీరు ఎలా ఉంది? అని ఆలోచించాలని సూచించారు. అలా చూస్తేనే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలుస్తారన్నారు. తెలంగాణ వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఆ సమయంలో కరెంట్ సమస్య ఉండేదని, ఇప్పుడు దానిని పరిష్కరించుకున్నామన్నారు. కులం, మతం భేదం లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Kcr
హైదరాబాద్, నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్‌కు గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్ రావుపై సీతక్క మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు. ‘ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు. ములుగులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. బాల్క సుమన్ వద్ద వందల కోట్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించడమే దీనికి కారణం. తన వద్ద వందల కోట్లు ఉన్నాయనే విషయాన్ని రేవంత్ నిరూపించాలని సుమన్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వందల కోట్లు ఇచ్చి చెన్నూరు కాంగ్రెస్ టికెట్ ను వివేక్ వెంకటస్వామి కొనుక్కున్నారని విమర్శించారు. వివేక్, వినోద్ వంటి వారు గెలిస్తే ఫ్యూడలిస్ట్ పాలన వస్తుందని అన్నారు. వివేక్ తండ్రి వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80కి పైగా సీట్లలో గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని..కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఆదివారం హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ హాజరైనారు..
ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎక్కడ చుసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు 144 సెక్షన్ లులాఠీఛార్జి లు ఉండేవని అన్నారు.. రాజకీయ అవసరాల కోసం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందే వారని అన్నారు.. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయం భయంగా గడిపే వారని…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకహిందూ ముస్లింలు ఒకటై కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు.. కెసిఆర్ హయంలో కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారని గుర్తు చేశారు.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.. రానున్న ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.. తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని వెల్లడించారు.. కానీ ప్రతిపక్షాలు వేస్తే కరెంటు నీళ్లు తెలంగాణ సంపదనను దోచుకుంటారని..కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని… అభివృద్ధిని చూసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఆశీర్వదించాలని అన్నారు..కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..
అచ్చంపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్ పై జరిగిన దాడి ని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. దాడి పిరికి చర్య అని మండిపడ్డారు. ప్రచారం నిర్వహించి తిరిగి వెళుతున్న క్రమంలో ఇలాంటి ఆటవిక చెరగకు పాల్పడడం కాంగ్రెస్ నేతలకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతామనే భయంతో ఇలాంటి పిరికి చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కు ప్రజల్లో ఉన్న ఆధార అభిమానులను చూసి ఓర్వలేకపోతున్నారని, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇన్నాళ్లు మాకు కలిగిందని ఇకపై కూడా ప్రజలు మమ్ములను ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని మా పార్టీ సేవలే మాకు శ్రీరామరక్షగా ఉంటాయని అన్నారు. దాడులకు పాల్పడితే సహించమని హెచ్చరించారు.
మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత విజయ్ పాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు, బీజేపీ నేత విజయ్ పాల్ రెడ్డి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి హరీశ్ రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో నారాయణ ఖేడ్ ఎమ్మెల్యేగా పనిచేసిన విజయ్ పాల్ రెడ్డి కొంత కాలంగా బీజేపీలో ఉన్నారు. ఈసారి టికెట్ ఆశించారు. కానీ సంగప్పను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తన తమ్ముడి గెలుపు కోసం పనిచేస్తానన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని కేసీఆర్ చూస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు స్వయంగా సీఎం కేసీఆరే డబ్బులు పంచుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఇమేజ్ లేదని ఎద్దేవా చేశారు. ధరణిలో కేసీఆర్ భూములే తప్పుగా చూసిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. సీఎం అవుతానని తాను ఏనాడూ చెప్పలేదని.. ముఖ్యమంత్రి అధిష్టానమే ప్రకటిస్తుందని తెలిపారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్ మొదటి నుంచి స్కాములు చేస్తుందని… బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అవసరమైన స్కీములను ఏర్పాటు చేస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్లకు నోటు కేసులో దొరికిన ఒక దొంగ… ఇక్కడున్న ఓ దొంగను గెలిపించమనడం ప్రజలు విస్తూ పోతున్నారని అన్నారు. ఇద్దరి దొంగలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. టూరిస్ట్ లాగా వచ్చి ప్రజలను మభ్యపెడితే ఊరుకునేది లేదన్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలుస్తుందన్నారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి బాలాజీ నగర్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు.. ఇందులో భాగంగా ఆంజనేయ నగర్… బాలాజీ నగర్, కెపిహెచ్బి రోడ్ నెంబర్ 1..3.. లో ప్రజలతో మాట్లాడుతూ ఒకప్పుడు బాలాజీ నగర్ డివిజన్లో మంచినీళ్లు కొరతతో చాలా ఇబ్బంది పడే వారమని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ మంచినీరు, సిసి రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చేసి చూపించామని అన్నారు. బాలాజీ నగర్ లో ఇంకా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి వస్తున్నామని భవిష్యత్తులో నాళాలు సమస్య అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరువులు సుందరీ కరణతో ఇప్పటికే రంగధామును చెరువును అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని మిగిలిన చెరువులను కూడా సుందరీకరించుకుని ఎస్టీపి ప్లాంట్లు నిర్మాణం పూర్తిచేసుకుని కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చబోతున్నామని అన్నారు.. ఇంత అత్యద్భుతమైన ప్రణాళికలు ఉండబట్టే నేడు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుందని ఇటువంటి ముందుచూపు ఉన్న వ్యక్తినే మళ్లీ సీఎం గా కొనసాగించాలని అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించుకుందామని.. తాను పోటీ చేస్తున్న కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇప్పించి గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్.. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..




Total views : 90650