రాష్ట్రంలో సంచలనంగా మారిన రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం అనూహ్యంగా మరో కీలక మలుపు తిరిగింది. గుంటూరులో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అనే యువకుడ్ని ఏపీ సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడికి ఈ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్లు వెల్లడైంది. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. విచారణలో ఇండస్ట్రీని కుదిపేస్తో్న్న రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో తెరపైకి ఈ మస్తాన్ సాయి పేరు వచ్చింది.
సాయి ఫోన్లో అనేక మంది యువతుల ప్రయివేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వారితో చనువుగా ఉండి వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు. కాగా, లావణ్యకు మస్తాన్ సాయి అనే వ్యక్తితో పరిచయం ఉందని రాజ్ తరుణ్ ఆరోపించిన విషయం తెలిసిందే. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో తెర పైకి మస్తాన్ సాయి. ఆయనతో కూడా ఇలాగే గొడవ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిందని అన్నారు. రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం కోర్టులో నడుస్తున్న తరుణంలో మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించినటువంటి ఒక ఆడియో లీక్ బయటకు రావడం, ఇప్పుడు అతని ఫోన్లో అమ్మాయిల వీడియోలు ఉండటం మరో సంచలనంగా మారింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141272