ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట కి చెందిన మల్లారపు వెంకట్రావు ప్రాణాల తో బయట పడగా.. అతని భార్య వెంకాయమ్మ ఘటనాస్థలం లోనే దుర్మరణం పాలైంది. జీ కొండూరు మండలం చిన్న నందిగామ మామిడి తోటలో కాపలా కి పనిచేస్తున్న వెంకట్రావు భార్యతో కలిసి మైలవరం రైతు బజార్ లో కూరగాయలు కొనడానికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Road Accident
విజయనగరం జిల్లా,
స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు. కొత్తవలస – అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన యువకుడు తేజ (23) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా నిమ్మలపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొనడం వల్ల సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరొక యువకుడు భాను తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పుంగనూరు, బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్. ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు పెద్దపంజాని(మం)భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు. స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అని పోలీసులు వెల్లడించారు.
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు చిన్న కుమార్తె పోతాబత్తుల నవీన గంగ, అల్లుడు లోకేష్ లు వారి కుమార్తె కుమారుడుతో టెక్సాస్ లో ఉంటున్నారు. సుమారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీన గంగతో కలిసి తండ్రి పొన్నాడ నాగేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులు టెక్సాస్ వెళ్లారు. టెక్సాస్ హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, సతీమణి సీతామహాలక్ష్మి, కుమార్తె పోతాబత్తుల నవీన గంగతో పాటు కుమారుడు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన పోన్నాడ నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది, సర్జరీ జరుగుతుంది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. ఆరాంఘర్ నుంచి మేహిదిపట్నం వైపు బైక్ పైన వెళ్తున్న అక్బర్ మోహిఉద్దిన్ (24) అనే ఓ యువకుని, శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 245 వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడం తో, యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఢీకొన్న వాహనం అక్కడ నుంచి ఫరారయ్యింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఒస్మానియా ఆసుపత్రికి తరలించారు.
NTR జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం జాతీయ రహదారి 65 మీద హైదరాబాదు నుండి విజయవాడ వైపు ప్రయానిస్తున్న కారు, ముళ్ళపాడు ప్లే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి, హైవే మీద డివైడర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొంది. ప్రమాద ఘటన లో కారు లోని యువతి మృతి చెందింది. కారు ఎలక్ట్రికల్ పోల్ ను ఢీ కొట్టడం తో మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను నందిగామ ఆస్పత్రికి తరలించారు.
హనుమకొండ, ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి. కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం. అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం. మృతులు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16). గాయపడ్డ మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవి లను చికిత్స కోసం ఎంజీఎం హస్పత్రికి తరలింపు. మృత దేహాలు ఎంజీఎం మార్చురీకి తరలింపు.
కె.వి పల్లి మండలం జిల్లెల మంద పంచాయతీ బసన్న గారి పల్లి వాసి చిన్న సిద్దయ్య సన్నాఫ్ లేట్ వెంకటస్వామి వయసు 50 సంవత్సరాలు అనబడే వ్యక్తి కె.వి పల్లి మండలం గుండ్రేవారిపల్లి నుంచి వస్తున్న సమయంలో కారు అతివేగంగా ద్విచక్ర వాహనం ని ఢీకొనడంతో చిన్న సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు వ్యక్తిని ఢీకొట్టిన కారు బావిలో బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కె.వి పల్లి మండలం పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణాజిల్లా.. గన్నవరం పంచాయతీ ఏరియాలోని కొనై చెరువు వద్ద డంపింగ్ యార్డును తలపిస్తున్న ఆగిరిపల్లి గన్నవరం ప్రధాన రహదారి. రోడ్డుకి ఇరువైపులా నిర్లక్ష్యంగా పడవేస్తున్న చెత్త కారణంగా దుర్వాసనతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైతాంగం గగ్గోలు పెడుతున్న గన్నవరం పంచాయతీ తీరు నిమ్మకు నేరెత్తని వైనం గా వ్యవహరిస్తుంది. గతంలో కొన్ని మీడియా ఛానల్లో పేపర్లో వార్తలు వచ్చిన స్పందించని పంచాయతీ అధికారులు, గన్నవరం పంచాయతీ లో ఈ చెత్తను తరలించి వేరే చోట డంపింగ్ చేయడానికి కోట్లలో గతంలో అవినీతి జరిగినట్టు నిరూపణ, రోడ్డు వెంబడి ఇరువైపులా ఉన్న చెత్తకు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడంతో ద్విచక్ర వాహనదారుడు దారి తెలియక వేరే వాహనంను ఢీ కొట్టాడు. క్షతగాత్రుని స్థానికుల సహాయంతో హాస్పిటల్ కు తరలించారు.
అనంతపురం రూరల్ సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అనంతపురం రూరల్ చిన్నంపల్లి క్రాస్ సమీపంలో బండల లోడుతో వెళుతున్న లారీ టైరు పంచర్ కావడంతో నిలిపారు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న కాళీ ఐచర్ వాహనం వేగంగా వచ్చి లారీ వెనుక వైపు ఢీ కొట్టింది. ఐచర్ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.





Total views : 141341