తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు వైసీపీ కి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో చేరుతున్నట్లు ప ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆవిలాల పంచాయతీకి చెందిన మాజీ జెడ్పిటిసి సుభాషిని,కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. చెవిరెడ్డి కుటుంబ పాలన తమకు గుర్తింపు ఇవ్వడంలేదంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు వాపోయారు. ఆత్మాభిమానం, గౌరవం కోసం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పులివర్తి నాని వెంట నడిచేందుకు సిద్దమయ్యామని తెలిపారు.
- విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
- ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.ఏపీ లిక్కర్ రవాణా కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కేసులో ముగ్గురు కీలక నిందితులను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు ఈడీకి అనుమతినిచ్చింది హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు. వీరి విచారణ…
- కడప జిల్లాలో రెండో రోజు మంత్రి లోకేష్ పర్యటన.కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కడప జిల్లాలోని మైలవరం మండలం, చిన్నకొమెర్ల సమీపంలో ప్రతిష్టాత్మక దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 212285