వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్-భీంసేన్ స్టేషన్ల మధ్య ఈ తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో 22 బోగీలు పట్టాలు తప్పాయి. అంటే దాదాపు రైలు మొత్తం పట్టాలు తప్పినట్టే. కాన్పూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంటకే ఈ ప్రమాదం సంభవించింది. కాగా, ఈ రైలు కంటే 9 నిమిషాల ముందు అదే మార్గం గుండా పాట్నా-ఇండోర్ రైలు సురక్షితంగా వెళ్లింది. రైల్వే ట్రాక్‌పై ఉన్న వస్తువును ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదని, ఒక్కరికి కూడా గాయాలు కాలేదని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలం వద్దకు బస్సులు పంపించారు. వాటి ద్వారా ప్రయాణికులను అహ్మదాబాద్ పంపే ప్రయత్నం చేశారు. ఓ పెద్ద బండరాయి ఇంజిన్‌కు తాకడంతో అది బాగా దెబ్బతిందని, ప్రమాదానికి అదే కారణమని లోకో పైలట్ తెలిపాడు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 150011