సీఎం జగన్(CM Jagan) పై ప్రతిపక్ష నాయకుల విమర్శలేమో గాని సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ వైఎస్ సునీతా(YS Sunita) జగన్పై సంచలన వ్యాఖ్యల చేశారు. ఎక్కువ రోజుల పాటు తలకు బ్యాండేజీ ఉంటే సెప్టిక్ అవుతుందని సెటైర్లు వేశారు. జగన్కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదేమో.. జగన్ త్వరగా బ్యాండేజ్ తీసేయాలంటూ ఓ వైద్యురాలిగా సలహా ఇస్తున్నానంటూ చురకలంటించారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బదులిచ్చారు. తన తండ్రి వివేకానంద రెడ్డిపై సీఎంకు ద్వేషం ఉందన్నారు. హత్యపై మాట్లాడొద్దని చెప్పి కోర్టుకు వెళ్లిన వారి అదే హత్యపై మళ్లీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్లుగా తన తండ్రి హత్యపై పోరాడుతుంటే నన్ను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని సునీత ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
- పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, నిధుల మళ్లింపు, అవినీతి జరిగాయని ఆరోపించారు.…
- అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 140884