వైఎస్ వివేకా కుమార్తె సునీత ఏపీ సచివాలయానికి వెళ్లారు. హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. సెక్రటేరియట్‌లోని రెండో బ్లాక్ చాంబర్‌లో అనితతో సమావేశమయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె వైఎస్ సునీత. సీబీఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న అనిత, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ. ఎప్పుడూ వినూత్న పథకాలు, సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం.. ఇప్పుడు వృద్ధుల కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…
- తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తతెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇందుకు సంబంధించి జీవో…
- రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
- అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు…
- నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియర్ అన్నట్లగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 80668