Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Health శరీరంలో విటమిన్‌ ‘డి’ తక్కువైతే..!

శరీరంలో విటమిన్‌ ‘డి’ తక్కువైతే..!

by Satya
vitamin D

ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందాల్సిందే. ఏ ఒక్క విటమిన్ లోపించినా. శరీరం అనారోగ్యానికి గురికావాల్సిందే. ఇక విటమిన్‌ ‘డి’ గురించి చెప్పనక్కరలేదు. దీని అవసరం శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే. విటమిన్-డి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దీని లోపం వల్ల మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘విటమిన్‌-డి’ తక్కువగా ఉండటం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా స్త్రీలతో ఈ సమస్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఎముకలకు కావాల్సిన క్యాల్షియమ్‌ను శోషించుకోవడానికి, కండరాలు బలహీనం కాకుండా రక్షించడానికి విటమిన్‌-డి తోడ్పడుతుంది. ‘విటమిన్-డి’ని సూర్యకాంతి నుంచి సులభంగా పొందవచ్చు. అలా కాని పక్షంలో డాక్టర్ సూచనతో విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. శరీరంలో విటమిన్‌-డి తక్కువైతే. నీరసం, నడుము నొప్పి, జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్-డి లోపం వల్ల కండరాల బలహీనత, డిప్రెషన్ విటమిన్-డి సమస్యలు వేధిస్తాయి. ఎముకల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మెదడు పనితీరుపైనా దీని ప్రభావం ఉంటుంది. గుండె పనితీరు చురుకుగా ఉండటంలో విటమిన్-డి ప్రధానపాత్ర పోషిస్తోంది. అధిక రక్తపోటు సమస్యలున్నవారు ‘విటమిన్-డి’ అశ్రద్ధ చేయకూడదు. బద్దకం, అలసట, నిరుస్సాహం, కోపం వంటి లక్షణాలు కూడా విటమిన్-డి లోపానికి సంకేతాలు. శరీరానికి అవసరమైన ‘డి’ విటమిన్ తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాము. గుడ్డులో పసుపు సొన, ఆర్గాన్‌ మీట్స్‌, ఆయిల్స్‌, పాలు, ఛీజ్‌, పన్నీర్‌, నెయ్యి, వెన్నలో ‘విటమిన్‌-డి’ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పుట్టగొడుగులో విటమిన్ డి సమృద్ధిగా దొరుకుతుంది. తరచుగా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక గుడ్డు పూర్తిగా తీసుకుంటే విటమిన్‌-డి లోపం రాదు. శరీరంలో విటమిన్‌ ‘డి’ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉదయపు ఎండలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే విటమిన్-డి లోపాలు ఉండవు. ఎండలో నడవడం, వ్యాయామం చెయ్యడం లాంటివి చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. విటమిన్ డి లోపం ఉన్నవారు డాక్టర్ సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎక్కవగా తీసుకున్న ప్రమాదమే.

Advertisements

You may also like

Our Visitor

026269
Total views : 150135

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.