Wednesday, September 9, 2026
News Navigation
Wednesday, September 9, 2026
News Navigation

Breaking

Wednesday, September 9, 2026
Home Andhra Pradesh నగర ప్రజలకు సంక్రాంతి నిత్యావసరాల పంపిణీ…

నగర ప్రజలకు సంక్రాంతి నిత్యావసరాల పంపిణీ…

by Prakash
Distribution program of essential items for Sankranti festival

సంక్రాంతి పండుగను చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని జీజేయేం చారిటబుల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త గురజాల జగన్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరులోని టిటిడి కళ్యాణమండపంలో నియోజకవర్గ పరిధిలోని 42 వేల మందికి సంక్రాంతి పండుగ కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందిపప్పు, గోధుమపిండి, మైదాపిండి, బెల్లం, వంటనూనె, పెసరపప్పు, నెయ్యితో కూడిన ఏడు నిత్యవసర వస్తువులతో కూడిన బ్యాగును చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని ప్రజలకు ప్రత్యేక వాహనాల ద్వారా వారి ఇంటి వద్దకే అందజేశారు. ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ..2024 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీజేఎం చారిటబుల్ ట్రస్టు ఫౌండర్ గురజాల చెన్నకేశవులు నాయుడు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: