Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై స్పందించిన వైఎస్‌ షర్మిల…

ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై స్పందించిన వైఎస్‌ షర్మిల…

by Prakash
YS Sharmila reacts on the post of AP Congress President...

ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్‌ షర్మిల స్పందించారు. తనపై నమ్మకం ఉంచిన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తాను మాణిక్యం ఠాగూర్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును తాను కోరుకుంటున్నానని… వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానంటూ షర్మిల ట్వీట్ చేశారు. ఏపి పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల కు శుభాకాంక్షలు.. ఆల్ ది వెరీ బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

013982
Total views : 78774

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.