Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshKarnool వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Rama
Mahashivaratri

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధానర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణలు నిర్వహించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు, చైర్మన్, మంత్రి కొట్టుకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డికి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి శ్రీస్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలను అందించగా అర్చకులు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనలిచ్చి దీవించారు.

ఇది చదవండి: కొండపల్లి IDA పోల్యుషన్ అధికారుల ఆకస్మిక దాడులు..


స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023223
Total views : 141590

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.