శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Sri Venkateswara Swamy Temple) :
దుద్యాల వడ్డిపల్లిలో నూతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవం..
దుద్యాల వడ్డిపల్లిలో నూతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Sri Venkateswara Swamy Temple) ప్రారంభోత్సవంలో రాయచోటి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి, కోటి రెడ్డి, రవీంద్ర రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మండిపల్లి సోదరుడు రాహుల్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు దైవచింతన కలిగి భక్తి భావంతో స్వామి వారికీ పూజలు నిర్వహించాలన్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఆ కలియుగ దైవమే సాక్షాత్ ఆ వైకుంఠ శ్రీ మన్నారాయణ డే మీ ప్రాంతంలో కొలువు తీరుతుండడంతో ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పున్యపలం అని వారు కొనియాడారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విశాల, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం నిర్మించడం చాల అభినందనియమం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి కలగాలి…
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి కలగాలని రాయచోటి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి లు అన్నారు. సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం వడ్డీ పల్లిలో నూతనంగా రు. 1.20 లక్షలు (కోటి 20 లక్షలు) నిర్మించిన ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మడితాటి శ్రీనివాసులు రెడ్డి లు హాజరయ్యారు.
బాజభజంత్రిలతో, బాణాసంచాలు, గజమాలలతో, మహిళల కర్పూర హరతులతో అపూర్వ స్వాగతం పలికిన స్థానిక ప్రజలు..
వీరికి ఆలయ కమిటి నిర్వాహకులతో పాటు స్థానిక నేతలు, ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో గజమలలతో, బాణాసంచాలు పేలుస్తూ, బాజభజంత్రిలు నడుమ దారి పొడువునా కర్పూర హరతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కమిటి నిర్వాహకులు దేపా ఎమ్మెల్యే అభ్యర్ధి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి, కోటి రెడ్డి, రవీంద్ర రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మండిపల్లి సోదరుడు రాహుల్ రెడ్డి లను దుస్సాలవలతో సన్మానించి అర్చకులు స్వామి వారికీ వారిచే ప్రత్యెక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రాయచోటి వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 3,500 మందికి మూడు రోజులు పాటు అన్నదాన కార్యక్రమం…
అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త ,టిడిపి నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మూడురోజుల పాటు కొనసాగుతున్న అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రజలంతా ఒక్కరికి ఒక్కరు సహకరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం చాల హర్శణీయమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి