Saturday, October 3, 2026
News Navigation
Saturday, October 3, 2026
News Navigation

Breaking

Saturday, October 3, 2026
Home Latest News నేటి నుంచి పెరగనున్న మెడికల్ ధరలు…

నేటి నుంచి పెరగనున్న మెడికల్ ధరలు…

by Prakash
National Pharmaceutical Pricing Authority (NPPA)

పెయిన్‌ కిల్లర్లు, యాంటి బయోటిక్స్‌, యాంటీ ఇన్ఫెక్టివ్స్‌ సహా పలు అత్యవసర ఔషధాల ధరలు ఈ రోజు ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్నాయి. ఈ లిస్టులో దాదాపు 923 రకాల ఫార్ములాలతో కూడిన అత్యవసర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ధరలు అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 0.0055 శాతం మేర పెరుగుతాయని జాతీయ ఔషధాల ధరల సంస్థ ఎన్​పీపీఏ వెల్లడించింది. ఈ మేరకు ఎన్​పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్​లో మందుల ‘టోకు ధరల సూచీ’లో వార్షిక మార్పును ప్రకటించింది. పెయిన్‌ కిల్లర్ డైక్లో ఫెనాక్ ఒక్కో టాబ్లెట్ ధర రూ. 2.05కి చేరింది. ఇబుప్రోఫెన్ టాబ్లెట్‌ల ధర రూ.71(200 Mg)కి, రూ.1.20 (400 Mg)కి పెరిగింది. WPIలో సూచించిన ధరలకు అనుగుణంగా షెడ్యూల్​ చేసిన ఫార్ములాల మందులపై ఎమ్మార్పీ రేటును కూడా పెంచొచ్చు. ఈ విధంగా ధరలు పెరిగిన లిస్టులో యాంటీ బయోటిక్స్, యాంటీ మలేరియల్స్, టైప్ 2 డయాబెటిస్‌కు రోగులు వాడే మందులు కూడా ఉన్నాయని సమాచారం.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: