Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home International ఇజ్రాయిల్‌లో మరోసారి ఉద్రిక్తతలు..

ఇజ్రాయిల్‌లో మరోసారి ఉద్రిక్తతలు..

by Satya
Tensions again in Israel..

ఇజ్రాయిల్‌(Israel)లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హెజ్బుల్లా దక్షిణ లెబనాన్‌ నుంచి దాదాపు 160 రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌, హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, తమ కీలక కమాండర్‌ తలెబ్‌ సమీ అబ్దుల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌కు చెందిన రెండు మిలిటరీ బేస్‌లపై రాకెట్లు, మిస్సైళ్లతో దాడి చేశామని హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇప్పటివరకు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.
    ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్‌గా…
  • వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.
    మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్‌ గ్యాంగ్‌ ట్రెన్‌ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్‌ రస్తెన్‌ఫోర్డ్‌ గురెరో ఫ్లోర్స్‌ హతమైనట్లు అమెరికా…
  • కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.
    కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023198
Total views : 141412

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.