Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక ప్రారంభం

పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక ప్రారంభం

by Rama
పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక ప్రారంభం

పల్నాడు జిల్లా వినుకొండలో ఉచిత ఇసుకను ప్రారంభించారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ పట్టణం నందు మార్కాపురం రోడ్ లో ఉచిత ఇసుకను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక పంపిణి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జీవో నెంబర్ 43 ని విడుదల చేయడం బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. నాణ్యమైన ఇసుక పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లోడింగ్, రవాణా చెల్లింపులు కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు. గత ప్రభుత్వంలో టన్ను ఇసుక 475 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 247 రూపాయలకే ప్రభుత్వం విక్రయిస్తుందన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి 228 రూపాయల తేడా ఉందన్నారు ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణరంగం దూసుకుపోయే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023260
Total views : 141679

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.