Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

by Satya
నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఢిలీ విమానాశ్రయంలో చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు, పెద్దలను సీఎం చంద్రబాబు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. రాత్రి 7గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..
    రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
  • అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..
    అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు…
  • నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..
    నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియ‌ర్ అన్నట్లగా…
  • ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..
    ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌లో ఉజ్జయినీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ఐతే ప్రమాదం సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యోగ్‌నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. షంటింగ్ చేస్తుండగా..…
  • హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..
    హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసమే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెల్లవారుజాము…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014631
Total views : 80637

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.