Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Main News ప్రైవేట్ హాస్పటల్స్ పై సీఐడీ కేసులు

ప్రైవేట్ హాస్పటల్స్ పై సీఐడీ కేసులు

by Rama
ప్రైవేట్ హాస్పటల్స్ పై సీఐడీ కేసులు

తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంలో విచారణను వేగవంతం చేశారు సీఐడీ పోలీసులు. ట్రీట్ మెంట్ చేయకుండానే నకిలీ పేర్లతో నిధులు స్వాహా చేసిన ఆస్పత్రులపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 హాస్పటళ్లపై సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు. 30 ఆస్పత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద వందల కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేసారని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రైవేట్ హాస్పటల్స్ పై సీఐడీ కేసులు. గ్రేటర్ హైదరాబాద్ లో 10 హాస్పటళ్లు, ఖమ్మం లో 10, నల్గొండ 4, కరీంనగర్‌ 2, వరంగల్‌ 1, మహబూబాబాద్‌ 2, హాస్పటళ్లపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పేషెంట్లు లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే బోగస్ బిల్లులతో ఆస్పత్రులు లక్షల్లో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టాయి ఆస్పత్రులు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014721
Total views : 80945

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.