నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేవంత్‌రెడ్డి చెక్కులు అందజేశారు. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని హెచ్‌ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్ ఆరోపించారు. యాజమాన్యానికి తొత్తుగా వ్యవహరిస్తూ కార్మిక సమస్యల పరిష్కారం కంటే పైరవీలకే పరిమితమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల…
- రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి…
- మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు.. గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు.…
- సెప్టెంబర్ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.ఉత్తరాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసే బృహత్తర సంకల్పం సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జీవనది గోదావరి జలాలను విశాఖపట్నం, అనకాపల్లి సహా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సీఎం చంద్రబాబు సెప్టెంబర్…
- నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణనేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలూ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి కైలాస మానససరోవర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి