Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News నిలిచిపోయిన 20 భారీ చమురు నౌకలు జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని…

నిలిచిపోయిన 20 భారీ చమురు నౌకలు జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని…

by CVR NEWS

ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. నిలిచిపోయిన 20 భారీ చమురు నౌకలు జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇరాన్ ఒక గొప్ప దేశం. వారు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగానే 20 భారీ చమురు నౌకలను హర్మూజ్ జలసంధి దాటేందుకు అంగీకరించారని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు భారీ ఊరట లభించినట్లయింది. యుద్ధ భయాలతో ఆకాశాన్నంటిన ముడిచమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా దాడులు, ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం దిశగా అమెరికా ప్రయత్నాలు వంటి పరిణామాల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. దౌత్యపరమైన చర్చలు లేదా వ్యూహాత్మక ఒత్తిడి కారణంగా ఇరాన్ తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఇది ఒక సానుకూల సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023118
Total views : 141007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.