Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.

కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.

by CVR NEWS
కొత్తగూడెం జిల్లా గ్రంథాలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల విద్యాభివృద్ధి, జిల్లా అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు.అనంతరం గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై రేణుకా చౌదరి విమర్శలు చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నప్పటికీ దేశ సమస్యలపై సరైన స్పందన లేదని ఆరోపించారు. విదేశాంగ విధానం దారుణంగా ఉందని, నేపాల్ వంటి దేశాలు కూడా భారత్‌ను బెదిరించే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడిందని, గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, గాంధీ కుటుంబంపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు.బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే లక్షలాది ఓట్లు తొలగించారని ఆరోపించిన ఆమె… తెలంగాణలో కేంద్రం ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: