కాకినాడ రూరల్ టిడిపి కో కో ఆర్డినేటర్ కటకంసెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచగా శ్రవణం కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన ఉమ్మడి రూరల్ శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ ల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టిడిపి జనసేన బిజెపి కూటమి తో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబీ) మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం లో పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని, రాష్ట్రం లో కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, దేశం లో ప్రధానిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జన సేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
East Godavari
తూర్పుగోదావరి జిల్లా, గోకవరం..
మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ | Jyotula Nehru
వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. సోమవారం తెలుగుదేశం బిజెపి జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో వైసీపీ(YCP) ప్రభుత్వం కొత్త సాంస్కృతిని తెరపైకి తీసుకువచ్చింది అన్నారు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు మెంబర్లపై వైసీపీ నాయకులు దాడిన తీవ్రంగా ఖండించిన జ్యోతుల నెహ్రూ. తక్షణమే వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పరిస్థితులు వేరేగా ఉంటాయన్నారు. నియోజవర్గంలో నన్ను ఎదుర్కొనే నాయకుడు లేడని రాబోయే ఎన్నికల్లో 25000 ఓట్ల మెజార్టీతో తాను విజయ సాధిస్తానన్న జ్యోతుల నెహ్రూ.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి | పురందేశ్వరిని(Purandeshwari) కలిసిన నల్లమిల్లి…
రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరిని కలిసిన అనపర్తి టీడీపీ(TDP) ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాజమండ్రిలో షెల్టన్ హోటల్ లో పురందేశ్వరిని కలిసిన నల్లమిల్లి. గత కొంతకాలంగా అనపర్తి సీటుపై టిడిపిలో కొనసాగుతున్న గందరగోళం. సీటు రాలేదని అసంతృప్తితో కొన్ని రోజుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో నియోజవర్గంలో ఇంటింటికి తిరుగుతున్న నల్లమిల్లి. ఇప్పటికే బీజేపీలోకి రావాలని నల్లమిల్లిని ఆహ్వానించినట్లు సమాచారం. పురందరేశ్వరి భేటీ పై కొనసాగుతున్న ఉత్కంఠ. సుమారు 30 నిమిషాల నుండి పురందరేశ్వరితో భేటీ అయిన నల్లమిల్లి.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీటు గందరగోళం విషయంలో రెండు రోజుల క్రితం నల్లజర్ల లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసిన నల్లమిల్లి. అనపర్తి సీటుపై నల్లమిల్లికి చంద్రబాబు ఒక బలమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. క్యాడర్ ఎవరు కంగారు పడొద్దు సీటు నీకే వస్తుంది అని నల్లమిల్లితో చంద్రబాబు చెప్పారని గుసగుసలాడుకుంటున్న టీడీపీ కార్యకర్తలు. పురందరేశ్వరి తో భేటీ అనంతరం అనపర్తి సీటు పోటీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం. కార్యకర్తల అభీష్టం మేరకే ముందుకు వెళ్తానని ఇప్పటికే చెప్పిన నల్లమిల్లి. సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయిన బరిలో ఉండాలని సూచనలు చేస్తున్న కార్యకర్తలు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్ 14 తేదీ వరకూ చేపల వేటను నిషేధిస్తూ పశుసంవర్థక, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖలు బుధవారం ఉత్తర్వులు జారీ చేశాయని డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మత్స్యశాఖాధికారి ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. యాంత్రిక పడవలు, మేకనైజ్డ్, మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను 61 రోజుల పాటు నిషేధించారన్నారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు ఈ నిషేధం విధించారని తెలిపారు.
ఈ మేరకు మత్స్య కారులు సహకరించాలని కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందన్నారు. అలాగే బోట్లు, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తారన్నారు. చేపల వేట నిషేధం సక్రమంగా అమలయ్యేందుకు మత్స్య శాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు.
కాకినాడ రూరల్ వైసిపి శాసనసభ అభ్యర్థి గా ప్రస్తుత శాసనసభ్యులు కురసాల కన్నబాబు (Kurasala Kannababu) తన ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామం శివాలయం లో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల సెట్టి సునీల్, కురసాల కన్నబాబు శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించి అనంతరం గ్రామం లో ఇంటింటికీ తిరిగి తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం కన్నబాబు, చలమల సెట్టి సునీల్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు అమలు చేసి ఇపుడు ప్రజా క్షేత్రం లో ఓటు అడుగుతున్నామని, రాష్ట్రం లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని దైర్యంగా అడిగే ఒకేఒక్క నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి పక్షాలు ఎంత మంది కలిసి వచ్చిన మళ్ళీ వైసిపి దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
ఇది చదవండి: ఐదేళ్లుగా జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పిఠాపురం (Pithapuram) : కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల వేళ డమ్మీ ఈవీఎమ్‌లు కలకలం రేపాయి. పెద్ద ఎత్తున మూటలతో వైసీపీ ఎన్నికల ప్రచార (YCP Election Campaign) సామాగ్రిలో కలిసి ఇవి ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. ప్లయింగ్ స్క్వాడ్ చేసిన తనిఖీల్లో పిఠాపురం బైపాసు రోడ్డులో వెళుతున్న బోలేరో వాహనంలో ఇవి పట్టుబడటంతో ఆ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది. ఇక్కడ వైసీపీ పలు ఎత్తుగడలు వేస్తుందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో మంగళవారం రాత్రి భారీ ఎత్తున డమ్మీ ఈవీఎమ్‌లు పట్టుబడటంతో అధికారులు సైతం కంగుతిన్నారు. కాకినాడ నుండి పెద్ద ఎత్తున వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిని తుని తరలిస్తుండగా పిఠాపురం బైపాసు రోడ్డు వద్ద ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని పట్టుకున్నారు. భారీ మూటలతో డమ్మి ఈవీఎమ్ లు ఉండటంతో తనిఖీలు చేసిన అధికారులు సైతం నివ్వెరపోవాల్సి వచ్చింది. ఇవి పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఉండటంతో వీటిని ఎందుకు తరలిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
వీటితోపాటు జగన్ చిత్రాలు ఉన్న మాస్క్‌లు, వైసీపీ టోపీలు, జెండాలు, కండువాలు, బొట్టు స్టిక్కర్లు ఇలా భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి రవాణా అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసామని, జీఎస్టీ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేయిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ విధానంలో ఉన్న ఈవీఎమ్‌లపై మాత్రం అధికారులు ఎటూ తేల్చలేదు. దీనిపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు పైడిరాజు, ఆర్.వి.ప్రసాద్ తెలిపారు.
ఇది చదవండి: అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కాకినాడ రూరల్ అర్ టి ఓ కార్యాలయం భాష్యం స్కూల్ వద్ద అనధికారికంగా అధికార పార్టీ నాయకులు ఒక అపార్ట్మెంట్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రం తో ముద్రించిన బొట్టు బిళ్ళలు, కీ చైనులు, జెండాలు, ఇళ్ల పటాలు పంపిణీ కి సిద్దం చేసి ఉంచారు. బిజెపి నాయకులు, జన సేన నాయకులు వైసిపి నాయకులు దాచిపెట్టిన స్థావరం వద్దకు వచ్చిన సమయంలో అధికార పార్టీ నాయకులు, బిజెపి నాయకులు, జన సేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ లో వీడియో చిత్రీకరణ చేస్తున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు.
దీనిపై ఎం.సి.సి టీమ్ 2 అధికారి కె.నాగేంద్ర కుమార్(K. Nagendra Kumar) సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియా వివరణ కోరగా తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. ఒక అపార్ట్మెంట్ లో అధికార పార్టీ నాయకులు దాచిన వస్తువులు, బహుమతులు పై వివరణ ఇవ్వడానికి ఎన్నికల అధికారి వెళ్లిపోవడం పై అసలు ఎన్నికల నియమావళి అమలు జరుగుతుందా లేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇది చదవండి: కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశం…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు లేఖ.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మారణాయుధాలు తొ దాడి చేయడం హేయమైన చర్య అని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ నాయకులు దాడికి కుట్ర చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం జగన్ చేస్తున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ప్రాణాలు కు తక్షణం కేంద్ర బలగాలు తో రక్షణ కల్పించాలని శ్రీనివాసరావు లేఖలో కోరారు. జగన్ కుటుంబం కు 53 సంవత్సరాల నుంచి నేర చరిత్ర ఉన్నది అని, 33 కేసు లలో ముద్దాయి గా జగన్ ఉన్నారని, దేశంలో అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ పార్టీ జగన్ పార్టీ అని శ్రీనివాసరావు గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వం తో సామాన్యులు నుండి ఎన్నికల కమిషనర్ వరకు రక్షణ లేదనీ తెలిపారు. జగన్ ప్రభుత్వం లో అనేక మంది ప్రజా ప్రతినిధులు మీద దాడులు జరిగిన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. జగన్ కు ప్రధాన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అన్న విషయం బహిరంగ రహస్యం అని లేఖలో పేర్కొన్నారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్టు కాకుండా సిఎం పదవిని అడ్డు పెట్టుకొని సిబిఐ మీదనే తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర జగన్ నేర స్వభావాన్ని తెలియ చేస్తున్నది అని పేర్కొన్నారు. తాలిబన్లు అరాచక పాలన లో పవన్ కళ్యాణ్ కు వెంటనే రక్షణ ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, పవన్ కు ఏ మాత్రం హాని జరిగినా రాష్ట్రం వల్లకాడు గా మారుతుంది అని చెప్పారు.
కాకినాడ జిల్లా.. తుని మండలం తేటగుంట కు బొడియ్య (Bodiyya) కూలీ పనుల నిమిత్తం పెద్దాపురం (Peddapuram) వచ్చాడు. ఏపిఐఐ కి చెందిన స్థలంలో డ్రైనేజీ పనులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కోల్డ్ స్టోరేజ్ (Cold Storage) గేటు ముందుకు తోయ్యాలని వాచ్ మన్ చెప్పడంతో మొత్తం నలుగురు వ్యక్తులు గేటును ముందుకు జరిపారు. ఈ క్రమంలో సుమారు మూడు టన్నులు బరువున్న గేటు బోడియ్యపై పడటంతో తలకు బలమైన గాయమే అక్కడికక్కడే మృతి చెందాడు. బోడియ్య మృత దేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అయితే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్యం వల్లే బొడియ్యా మృతి చెందాడని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బందువుల కోల్డ్ స్టోరేజ్ వద్ద బైఠాయించారు.
విషయం పెద్దదవుతుందని గ్రహించిన కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం విషయాన్ని పెద్దాపురం పోలీస్ స్టేషన్ అడిషనల్ ఎస్ఐ సతీష్ చెప్పారు. దీంతో ఎస్ఐ సతీష్ మృతుని బంధువులకు ఫోన్ చేసి స్టేషన్ కు వస్తే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సెటిల్ చేస్తామని చర్చలకు పిలిచారు. స్టేషన్ కు వెళ్లిన తర్వాత ఇరు పార్టీలను తన రూంలోనే కూర్చోబెట్టి కోల్డ్ స్టోరేజ్ నుండి 2.5 లక్షల రూపాయలు పనికి పిలిచిన కాంట్రాక్టర్ నుండి రెండు లక్షల రూపాయలు మొత్తంగా నాలుగు లక్షల రూపాయలు మృతుని కుటుంబానికి ఇచ్చేలా సెటిల్ చేసి కేవలం ప్రమాదవశాత్తు బోడియ్యా చనిపోయాడని ఇకముందు కంపెనీపై ఎటువంటి పెట్టకూడదు అని కాగితాలు రాయించారు. కంపెనీపై కానీ, కాంట్రాక్టర్ పై కాని ఎటువంటి కేసు లేకుండా స్టేషన్లోనే సెటిల్మెంట్ చెయ్యడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి: వైసీపీ గ్రామ సర్పంచ్ మురుగేష్ గ్రామస్తుల పై దాడి..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
కాకినాడ జిల్లా, పిఠాపురం
పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారి ప్రసంగం | Janasena Pithapuram
వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే ఏకైక లక్ష్యం
• రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్టగా పని చేద్దాం
• రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తు కోసం తపించాను
• రాబోయేది కూటమి ప్రభుత్వమే.. భారీ మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం
• మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా గెలుపు కోసం ముందుకు
• పిఠాపురం నియోజకవర్గ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమన్వయ సమావేశంలో ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు
‘మూడు పార్టీల సమన్వయంతో, పొత్తుల మీద ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయి. కానీ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పడిన జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీల పొత్తు విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరింది. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ లెక్క వేయలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ప్రజలను బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పొత్తులకు ఎలాంటి షరతులు పెట్టకుండానే ముందుకు వెళ్లాం. రాష్ట్రం కోసం, ప్రజల బాగు కోసం వెనక్కు తగ్గేవాడిని కాదు ‘ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు అన్నారు. ఆదివారం పిఠాపురం(Pithapuram)లో జనసేన- తెలుగుదేశం- బీజేపీ నాయకుల ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిఠాపురం(Pithapuram) నియోజక వర్గం టిడిపి ఇంచార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ గారు, కాకినాడ లోక్ సభ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంచార్జ్ శ్రీ బి. కృష్ణంరాజు గారు పాల్గొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
“పొత్తుల వల్ల మా పార్టీ నాయకులు కూడా చాలా నలిగిపోయారు”- పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు మాట్లాడుతూ… “పొత్తుల వల్ల మా పార్టీ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. చాలా మంది రాజకీయంగా పోటీ చేయలేకపోయామని బాధపడ్డారు. కానీ రాష్ట్రం కోసం మనసుతో స్పందించాను. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే కచ్చితంగా మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో పాలన సాగించాలని భావించాను. బీజేపీ కేంద్ర పెద్దలు తమకు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరితే రెండు ఎంపీ స్థానాలకే జనసేన పరిమితమైనా, బీజేపీ పెద్దల మనోభీష్టాన్ని కాదనకుండా ముందుకు వెళ్లాం. అందరినీ కలుపుకొని వెళ్లాలన్నదే నా ఆకాంక్ష.
• 80 శాతం మంది పొత్తుకు అంగీకరించారు
ఒక పార్టీలో విభిన్నమైన వ్యక్తులు, ఆలోచనలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఏకాభిప్రాయం రాకపోవచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ మంది దేనివైపు మొగ్గు చూపుతున్నారో ఆ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. పొత్తు విషయంలో కూడా జనసేన, టీడీపీ పార్టీల్లో మొదటే 70 నుంచి 80 శాతం మంది పొత్తుకు అంగీకరించారు. దీంతోనే పొత్తుకు ముందడుగు పడింది. 2014లో ఎలాంటి షరతులు, డిమాండ్లు లేకుండా అప్పటి తెలుగుదేశం, బీజేపీ పొత్తుకు జనసేన సంపూర్ణంగా మద్దతు తెలిపింది. అప్పటి పరిస్థితుల్లో 10 మందిని ఎన్నికల్లో నిలబెట్టే సత్తా ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం సుస్థిరమైన పాలన కోసం సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం. ఎలాంటి డిమాండ్లు, పదవులు ఆశించలేదు. ఇప్పుడు.. 2024లో సైతం జనసేన బలం పెరిగింది అని తెలిసినా గందరగోళం లేకుండా ముందడుగు వేయాలనే తలంపుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే పొత్తులకు మనమే చొరవచూపాం. బీజేపీ-టీడీపీ పార్టీల వంటి బలమైన పునాదులు, సమూహాన్ని క్రమిశిక్షణతో నడిపించే మెకానిజం జనసేన పార్టీ ఇంకా సంపాదించలేదు. మనకు యువబలం, పోరాడేతత్వం మెండుగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో దశాబ్ధాలుగా రాజకీయం చేస్తున్న పార్టీల ఎత్తుగడలు, ఎలక్షనీరింగ్, సమన్వయం చాలా కీలకం. జనసేన పార్టీ ఎల్లప్పుడు మంచిని స్వీకరిస్తునే ఉంటుంది. కొత్త విషయాలను, పార్టీ నిర్మాణాన్ని ఇతర పార్టీల నుంచి తెలుసుకుంటూ ముందుకు కదులుతాం.
• శ్రీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు బాధేసింది
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి, సైబరాబాద్ వంటి ప్రత్యేక నగరాన్ని తయారు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు గారిని వైసీపీ ప్రభుత్వం అకారణంగా జైల్లో పెట్టినప్పుడు చాలా బాధపడ్డాను. రాజమండ్రి వెళ్తున్నపుడు దారి పొడవునా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ నాయకుడి కోసం పడిన తపన కదిలించింది. అందుకే రాజమండ్రి జైల్లో శ్రీ చంద్రబాబు గారిని కలిసిన తరువాత నా వంతుగా ఏదైనా చేయాలి అనుకున్న సమయంలో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించాను. అప్పుడు ఆశించినట్లుగానే బీజేపీ కూడా తరువాత పొత్తులోకి రావడం ఆనందం కలిగించింది. నేను పొత్తు కోసం ఎంతగా తపించానో… పొత్తును గెలిపించడం కోసం మూడు పార్టీల నాయకులు అంతే కష్టపడాలి. అందరం కలిసి ఈ వైసీపీ పాలనను తరిమికొట్టాలి.
• శ్రీ వర్మ గారి గౌరవానికి భంగం కలగనివ్వబోము
శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారి నాయకత్వ పటిమ, సమర్ధత, ప్రతిభ నేను పూర్తిగా అర్ధం చేసుకున్న వాడిని. త్రిముఖ పోటీ ఇప్పుడున్నా సరే శ్రీ వర్మ గారికి తగిన గౌరవం ఇచ్చే వాడిని. శ్రీ చంద్రబాబు గారు గీసిన గీత దాటను అని వర్మ గారు చెప్పడం నాకు ఆనందం కలిగించింది. పిఠాపురంలో నా గెలుపు బాధ్యత తీసుకున్న శ్రీ వర్మ గారికి … నేను గెలిచిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఆయన మర్యాద తగ్గకుండా, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాను. ఒంటెద్దు పోకడలకు పోను. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు పార్టీల మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులను తగిన విధంగా సమన్వయం చేసుకుంటాం. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలి అన్నదానిపై మూడు పార్టీల నాయకులు ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుందాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు రక్షణగా ఉండాలనే ఏకైక కోరికనే కేంద్ర పెద్దల వద్ద కోరాను. అలాంటి బీజేపీ నాయకులను కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాం. జనసేన పార్టీ నుంచి కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కష్టపడి పైకి ఎదిగిన యువకుడు. 2017లో రూ. 10 లక్షల పెట్టుబడితో మొదలు పెట్టిన టీ టైం వ్యాపార ప్రస్థానం దేశం దాటి నేపాల్ లో కూడా విస్తరించింది. యువత తెలివితేటలకు ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యక్ష తార్కాణం. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ మంచి వ్యక్తే అయితే తప్పడు పార్టీలను ఎంచుకుంటారు. ఆయన ఇక్కడ సంపదను పట్టుకుపోతే… ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ నుంచి సంపద సృష్టించి యువతకు దారి చూపుతాడు. అలాంటి యువకుడికి మీరంతా అండగా నిలబడాలి.
• పింఛన్లు అందరికీ అందేలా కృషి చేద్దాం
ప్రతి నెల అందాల్సిన సామాజిక పింఛన్లు ఎన్నికల కోడ్ వల్ల ఈ నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయడంలో అధికారులకు తగిన విధంగా మూడు పార్టీల నాయకులు తోడ్పాడాలి. ఎన్నికల నియమావళిని అనుసరించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేద్దాం. వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పండి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు నేను సహాయం చేశాను అంటే సొంతంగా సినిమాలు చేసి సంపద సృష్టించి ఆ డబ్బును ఆపదలో ఉన్న వారికి పంచాను. వచ్చే కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టించి కచ్చితంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇస్తున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాం తప్ప ఏ మాత్రం పథకాలు నిలిపివేసేది లేదు. వైసీపీ పాలనలో మద్యం, గంజాయి, ఇసుక, ల్యాండ్ మాఫియా వంటి వాటిని అరికడితే అన్ని పథకాలకు కచ్చితంగా డబ్బులు సర్దుబాటు అవుతాయి. వైసీపీ దోపిడీ అరికడితే సంక్షేమ పథకాలు అప్పులు లేకుండానే అమలు చేయొచ్చు. నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను.. వచ్చేది కూటమి ప్రభుత్వమే. మనం కచ్చితంగా గెలుస్తున్నాం. భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. మూడు పార్టీల్లోని ప్రతి కార్యకర్త నాయకుడు 40 రోజుల మండల దీక్ష చేసినట్లు, రంజాన్ రోజా రోజులు ఉపవాసం ఉన్నట్లు నిష్టగా మన ప్రభుత్వ స్థాపనకు పని చేద్దాం. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం అనే రెండే అజెండాలుగా సమష్టిగా ఎన్నికలను ఎదుర్కొందాం. ఘన విజయం సాధిద్దాం” అన్నారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి