సీఎం జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు. పదవులు ఇంకా పెరుగుతాయన్నారు. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగిందని చెప్పారు. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారన్నారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది అంటూ కృష్ణయ్య కొనియాడారు.
Guntur
రాష్ట్రంలో ఈ చలనా కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ ని అరెస్టు చేశాం. ఈ చలనా కేసులో మరో ఇద్దరు డైరెక్టర్ల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది.. ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ఈ చలనాలు nic అనే కంపెనీ ద్వారా నుంచి కట్టే విధంగా రూప కల్పన చేస్తున్నారు. ఈ చలనా కేసులో టెండర్ల ప్రక్రియను కుంభ కోణం కేసులో డిజిపి ఆధ్వర్యంలో లోతైన విచారణ జరుగుతుంది.. ఈ చలనా కేసులో 36.58కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ చలనా కేసులో 16ఆస్తులను గుర్తించి సిజ్ చేశాం వాటి విలువ 13కోట్ల రూపాయలు ఉంటుంది.
పెదనందిపాడు మరియు కాకుమాను మండలాలకు కలిపి ఓట్లు సవరణ మరియు చేర్పుల నిర్వహణ కమిటీ పర్యవేక్షణ. ఇందులో భాగంగా పంచాయతీ సెక్రటరీలు వీఆర్వోలు గ్రామ సచివాలయ సిబ్బంది లు అందరితో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఆర్డిఓ పీ శ్రీకర్ పెదనందిపాడు ఎమ్మార్వో ఎస్ కే మహబూబ్ సుభాని కాకుమాను ఎమ్మార్వో ప్రసాద్ కలిసి పెదనందిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో ఓట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా దొంగ ఓట్లు చేర్చకుండా జాగ్రత్తగా పరిశీలించాలని వీఆర్వోలకు సచివాలయ సిబ్బందికి ప్రతి గ్రామంలో ఓట్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని దీనికిగాను మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మా దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
గుంటూరు లో చైన్ స్నాచింగ్ దొంగను పట్టుకున్న నల్లపాడు పోలీసులు. నల్లపాడు పొలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు
నల్లపాడు SHO రాంబాబు మాట్లాడుతూ నగరం లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు. సమ్మితి నరసింహ అనే ముద్దాయి చెడు వ్యసనాలకు బానిసగా మారి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశంతో చైన్ స్నాచింగ్ కు అలవాటు పడ్డాడు. ముద్దాయి 2 కేసులలో దొంగ గా నిర్ధారించారు… ముద్దాయి వద్ద నుండి 39 గ్రాముల బంగారం రికవరీ చెయ్యటం జరిగింది. రికవరీ చేసిన బంగారం విలువ 2 లక్షల రూపాయలు వరకు ఉంటుంది దొంగతనానికి ఉపయోగించిన 2 వీలర్ ను సైతం స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసాము..
నిన్న జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చేంత జనాధనర నిన్న నరసరావుపేట లో కనిపించింది. నరసరావుపేట సెగ్మెంట్ లో Sc,st,bc,మైనారిటీలకు ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని 80 వేల కుటుంబాలకు 820 ఓట్లు లబ్ది చేకూర్చము. ప్రజలు వైస్సార్ పార్టీ,గోపిరెడ్డి వెంటే ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టి చూపిస్తాను..
ఒక్కోసారి చిన్నపాటి గాయం కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుంది.. ఫలితంగా పూడ్చలేని నష్టాన్ని మిగులు తీస్తుంది. తాజాగా గుంటూరులో ఒక యువకుడి విషయంలో ఇదే జరిగింది. ఢిల్లీలో సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ గుంటూరుకు వచ్చి చిన్న ప్రమాదం జరిగింది, చిన్న గాయమే అని లైట్ తీసుకున్నాడో ఏమో కానీ… బ్రెయిన్ డెడ్ అయ్యి అనారోగ్యం పాలైన యువకుడి. ఒక్కగానొక్క కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వయసులో ఆ తల్లితండ్రుల బాధ వర్ణాణాతీతం!
పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడి నుండే పోటీ చేస్తా.. అసెంబ్లీలో అడుగుపెడతా.. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సత్తెనపల్లి గడ్డ… కోడెల అడ్డా… అనేది తద్యమని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం చేశారు. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో భాగంగా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం విస్తృతంగా పర్యటించారు. తమ అభిమాన నాయకుని కుమారుడు యువనేత డాక్టర్ కోడెల శివరాం తమ గ్రామంలోకి వస్తున్నారని తెలుసుకున్న ముస్లిం యువత అధిక సంఖ్యలో ఎదురెళ్లి మరి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరామ్ మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీలో ఉండడం ఖాయమని కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక ప్రజాభిమానంతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడం కూడా అంతే తద్యం అన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసే నాయకుల్ల రోజుకో జెండా మోయడం కోడెల రక్తంలో లేదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నానని యువ నేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుదేశం నాయకత్వాన్ని బలపరచాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కోడెల వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, కోడెల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా సంగం డెయిరీ డైరక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 15న సంగం డెయిరీ వద్ద జరిగిన దాడి కేసులో అరెస్ట్ చేసి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదే కేసులో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు మరో 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదైంది. సంగండైరీలో పాల విక్రయానికి సంబంధించి బోనస్ 14 శాతం ఇవ్వమని అడిగినందుకు, డెయిరీ వద్దకు మాట్లాడదామని పిలిచి దాడి చేసినట్లు భాదితుడు రాము ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో 3కార్లు ధ్వంసం చేసి, కర్రలు, హాకీ స్టిక్స్‌తో దాడి చేసారంటూ ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ధూళిపాళ్ల నరేంద్రను 14వ నిందితునిగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Read Also..
Read Also..
రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలోని ప్రధాన రహదారి పై ఏర్పడ్డ గుంతల వద్ద జనసేన మరియు టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జనసేన మరియు టీడీపీ నాయకులు రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో మోటార్ సైకిళ్లను పడేసి వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించిన అసమర్థ సీఎం జగన్‌ను సాగనంపేందుకు సమయం దగ్గర పడిందని వారు తెలిపారు. అసమర్థుడైన పాలకునికి రాష్ట్రం అప్పగిస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలంతా గమని స్తున్నారన్నారు. ఏ మూలకు వెళ్లినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. సైకో ప్రభుత్వాన్ని పారదోలి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పల్నాడు జిల్లా గురజాల మండలం కొత్త అంబాపురం గ్రామంలో నిన్న సాయంత్రం హత్యకు గురైన ప్రత్తి. రామారావు మృతదేహాన్ని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు సందర్శించి , కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం హత్యకు గురైన రామారావు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసినట్లు వారు తెలిపారు. ఈ కేసులో పూర్తిగా అన్ని కోణాలలో విచారణ జరిపి, నేరస్తులను కఠినంగా శిక్షించాలని వారు పోలీసు శాఖ ని కోరారు. కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.