రాజకీయ అవినీతిపై నా మెదటి పోరాటం జరుగుతుందని అందులో బాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతిపై రేపు పులివెందుల పోలిస్ స్టేషన్ లో మాపార్టి నాయకులతో కలిసివెళ్ళి పిర్యాదు చేస్తామని భారత చైతన్య యువజన పార్టి (BCY ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ తెలియజేసారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం BCY పార్టి కేంద్ర కార్యలయాన్ని ప్రారంభోత్సవం చేసారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాకాంక్ష మేరకు పార్టి రాజకీయ పార్టి ప్రారంభిచానని రాబోయే వారం రోజుల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో పార్టీ కమిటీలను ప్రకటిస్తామన్నారు. యువతకి, రైతులకు, మహిళా సాధికారిక ప్రాధాన్యం ఉంటుందన్నారు, ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో 45 మంది మా పార్టి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు ఉండదని ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలలో పోటీ చేస్తామని వివరించారు. గెలుపు లక్ష్యంగా బీసీవై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యచరణ ఏర్పాటు చేశామని సమావేశంలో వెల్లడించారు.
Guntur
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో మీ సేవకు ఎదురుగా గణేష్ ప్లాజా నిర్వహిస్తున్నాడు. వల్లు గోపి వయసు 26 సంవత్సరాలు గత కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో ఇతనిపై భార్య అత్తమామలు కేసు పెట్టారు. ఆడపిల్ల పుట్టిందని వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను ఆడపిల్ల పుట్టిందని ఎప్పుడు నా భార్యను కొట్టలేదని ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఆ వీడియోలు తన అక్కకు స్నేహితులకు పంపించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది అంటూ పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో టిడిపి- జనసేన పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. దాచేపల్లి పట్టణం నుంచి కేసానుపల్లి వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎటువంటి రోడ్లు వేయలేదన్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ గుంతల రోడ్ల మీద ప్రయాణిస్తూ , ఎంతో మంది యువకులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి తన బిడ్డను చూడటానికి వెళ్తూ… రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఇలా ఏన్నో కుటుంబాలు ప్రమాదం బారిన పడి రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ఈ కళ్ళు లేని కబోది , మూగ వైసీపీ ప్రభుత్వం రోడ్లని బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ – టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయులు, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇరు పార్టీలు కలిసికట్టుగా చెయ్యవలసిన రాజకీయ ప్రయాణం గురించి, ప్రజల సమస్యల గురించి చర్చించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని నిలువరిస్తూ… భవిష్యత్ కి మా గ్యారెంటీ అని భరోసా ఇచ్చి, గడప గడపకు ఉమ్మడి ప్రచార కార్యాచరణ నిర్వహించడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమన్నారు. నేరేళ్ల సురేష్ గారు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ఇరు పార్టీలు కలిస్తే 2014 ఎక్కడ పునరావృతం అవుతుందని అధికార పార్టీ నాయకుల్లో అలజడి మొదలయ్యిందన్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది కాంప్లెక్స్ లోని ఒక షాపులో నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు, స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు రెండు నిమిషాల్లోనే అక్కడికి వచ్చి ఆ మంటలను అదుపు చేయడం జరిగింది, దీనివలన ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అగ్నిమాపక శాఖ వారు సకాలంలో స్పందించడం వలన స్థానికులు అలానే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వారు హర్షం వ్యక్తం చేశారు
మైనింగ్ శాఖ లో అసిస్టెంట్ జియాలజిస్ట్ గండి కోట వేంకటేశ్వర్లు నివాసంలో శుక్రవారం ఏసీబీ దాడులు…రెయిన్ ట్రీ పార్క్ లోని నివాసంలో నంద్యాల భూగర్భ ,గనుల శాఖ కార్యాలయంలో మరో ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ప్రాదమిక దర్యాప్తులో 3.7 కోట్లు
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆధారాలు లభ్యం. వీటిలో 21 ప్లాట్లు మరియు ఖరీదైన భవంతి ఉన్నవని ఏసీబీ ASP మహేంద్ర తెలిపారు
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అద్దంకి – నార్కెట్ పల్లి హైవే రహదారి ప్రక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతుడు రిక్షా కూలిగా, అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికుల సమాచారాన్ని తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్యా.. ఆత్మహత్యా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
టీడీపీ, జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుంది – టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు.
ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ మాకినేని పెద్ద రత్తయ్య ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూర్ల రామాంజనేయులు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ హాజరవ్వగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సంఘాల నాయకులు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం తనకి ఎప్పటినుంచో సుపరిచితమని ప్రతిపాడు లో అఖండ మెజార్టీతో టిడిపిని గెలిపించుకుంటానని ఈ సందర్భంగా ప్రతిపాడు టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు తెలిపారు.. టిడిపి జనసేన ప్రవాహానికి వైసీపీ కొట్టుకుపోతుందని అన్నారు..
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ హజరయ్యారు. నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని హుకుం జారీ చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పరిమిషన్లు తీసుకోవాలని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం, ఇసుక మీద చాలా దోచుకుంటున్నారన్నారు. నందిగామలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని దానికి వైసిపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు ఇక్కడ మన ఎమ్మెల్యే దోచుకుంటాడని విమర్శించారు.
Read Also..
Read Also..
పత్తిపాడు టిడిపి నియోజక వర్గ ఇంచార్జి రామాంజనేయులు పాయింట్స్ .. గుంటూరు…వైసీపీ కార్యక్రమాలు కాపీ కొట్టాల్సిన అవసరం టిడిపి, జనసేనలకు లేదు.. గుంటూరు లో టిడిపి. జనసేన పత్తిపాడు కార్యకర్తల ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో టిడిపి రూపొందించిన సూపర్ సిక్స్ అంశాలతో పాటు జనసేన పొందుపరచిన ఐదు అంశాలను ప్రతి ఇంటికి తీసుకు వెళ్లతాం.. బిసి చట్టం ,అమ్మకు వందనం.కవుల రైతుల సమస్యలు లాంటివి ఎన్నో పరిష్కారం చేస్తామని వివరిస్తాం. రాష్ట్రంలో వైసీపీ కి ప్రత్యామ్నాయంగా టిడిపి ,జనసేన ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలకి వివరిస్తాం…. ప్రతి పేదవాడి ని అభివృద్ధి పథంలో పాటు లక్షాధికారి ని చేయడమే మా ఇరు పార్టీల లక్ష్యం. ఎన్ టి ఆర్ పార్టీ పెట్టిన తరువాతే పేదవాడికి రెండు రూపాయలకి కిలో బియ్యం ప్రసాదించిన వరం గా భావించారు. టిడిపి కార్యక్రమాలు రూపకల్పన లాంటి అనేక విషయాలు ఇతర పార్టీల నేర్చుకోవాలి.