Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News కార్యాలయానికి చుట్టం చూపుగా వస్తున్న ఎంఆర్ఓ…

కార్యాలయానికి చుట్టం చూపుగా వస్తున్న ఎంఆర్ఓ…

by Prakash
కార్యాలయానికి చుట్టం చూపుగా వస్తున్న ఎం ఆర్ ఓ, MRO, MRO office

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో మండల విద్యాశాఖ కార్యాలయానికి చుట్టం చూపుగా వస్తున్న ఎంఆర్ఓ. మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి అందుబాటులో ఉండక పోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంఈఓ స్థానికుడు కావడంతో కార్యాలయానికి చుట్టం చూపుగా వచ్చి వెళుతుండడం పలు విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు శాఖ పరమైన పని నిమిత్తం కార్యాలయానికి వెళ్తే ఎంఈఓ అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొబైల్ కాల్స్ కు కూడా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెన్నూర్, జైపూర్, భీమారం మూడు మండలాలకి కలిపి ఒకే ఎంఈఓ ఉండడంతో ఈ మూడు మండలాలకి చెందిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు ఎంఈఓపై జిల్లా విద్యాశాఖ అధికారికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత స్థాయి అధికారులు స్పందించి సదరు ఎంఈఒ పై చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. Read Also

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

019358
Total views : 90539

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.