కడప జిల్లా పులివెందుల పరిధిలోని కె. వెలమవారిపల్లె సమీపంలో కోట్లాది రూపాయలు విలువచేసే వందలాది ఎకారాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ భూములను రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 229, 230, 239 లలో ఉన్న భూములను, చెరువులను భూ బకాసురులు కొండలను, చెరువులను ఆక్రమించి చదును చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయంపై విచారణ చేపట్టి బాధ్యులైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలను జిల్లా కలెక్టర్, సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే కదిరి రోడ్డులో ఉన్న కంపోస్ట్ యార్డ్ వద్ద ఉన్న కొండపై అక్రమంగా చర్చి నిర్మాణం ఎలా చేపట్టారని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపి వెంటనే కలెక్టర్ కు నివేదిక సమర్పించాలని రాంగోపాల్ రెడ్డి సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి