Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Sports IPL match 2024 : ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం..

IPL match 2024 : ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం..

by Satya
Gujarat Titans win over Mumbai Indians in IPL match


IPL match 2024:

అహ్మదాబాద్‌(Ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)పై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) విజయం సాధించింది. ఉత్కంఠ భరిత పోరులో 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కీలక సమయంలో వికెట్లు తీసి గుజరాత్‌ను విజయ తీరాలకు చేర్చారు. 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ మూడో వికెట్‌కు ఏకంగా 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ముంబై కి విజయం సునాయాసంగా మారింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

గుజరాత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. చివరి 3 ఓవర్లలో ఆట గుజరాత్ టైటాన్స్ వైపు తిరిగింది. 18వ ఓవర్‌ వేసిన మోహిత్ శర్మ కీలక బ్యాట్స్‌మెన్ టిమ్ డేవిడ్‌ను ఔట్ చేసి మ్యాచ్‌‌ను మలుపుతిప్పాడు. ఆ తర్వాతి ఓవర్‌లో స్పెన్సర్ జాన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్‌లో 19 పరుగులుగా మారింది. క్రీజులో ఉన్న కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో మొదటి బంతిని సిక్సర్ బాదాడు. రెండో బంతిని ఫోర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత రెండు బంతుల్లో హార్దిక్, పియూష్ చావ్లాలను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. చివరి 2 బంతుల్లో 9 పరుగులు అవసరమవ్వగా 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఓడిపోయింది.

ఇది చదవండి: ఐపీఎల్ స్టార్ట్…. ధోని vs కోహ్లీ


Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..
లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది అద్భుతమైన విజయం, అలాగే ఎంతో క్లినికల్‌గా సాగిన చేజ్. ఈ …
పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
పంజాబ్ కింగ్స్ పూర్తిగా నిరుత్సాహంగా కనిపిస్తోంది. వరుసగా ఐదో ఓటమిని చవిచూసిన వారు చాలా కాలంగా …
వరుసగా రెండు డక్స్ తర్వాత కోహ్లీ భారీ కంబ్యాక్.. ఐపీఎల్‌లో 9వ సెంచరీ..
వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం 75 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ, రాయ్‌పూర్ ప్రేక్షకులు ఓర్పుగా ఎదురుచూశారు. వారి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013995
Total views : 78793

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.