బాపట్ల పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18వ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్న తరుణంలో, అంగన్వాడీ శిబిరంలో ఒక అంగన్వాడీ కార్యకర్త కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే తేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు సపర్యాలు చేసి దగ్గర్లోని హాస్పటల్ కు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ ఆకలి కేకలతో మేము రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నా.. ఆరోజు పాదయాత్రలో మా తలలు నిమిరి, చెంపలు నిమిరిన ముఖ్యమంత్రికి మా బాధలు కనపడట్లేదా, మా ప్రాణాలు పోయే వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించరేమోనని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.
anganwadi workers
బాపట్లలో అంగన్వాడీలు రోడ్డుపై 18 వ రోజు అని అక్షరాల రూపంలో రోడ్డుపై కూర్చొని అంగన్వాడీలు వినూతన నిరసన తెలిపారు. మాట తప్పిన సీఎం డౌన్ డౌన్, మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు, మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని హోరెత్తించిన అంగన్వాడీలు బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18వ రోజు అంగన్వాడీలు మొదట పది గంటలకు జగన్మోహన్ రెడ్డికి వినిపించేలా చిటికెలు వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 18 రోజుల నుండి మేము సమ్మెలు, దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
Read Also..
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపును ఇచ్చారు. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి అంగన్వాడి కార్యకర్తలు వస్తున్నారని సమాచారంతో వివరాలు తెలుసుకొని నేనే ధర్నా చౌక్ కి వస్తున్నాను అని తెలిపిన పేర్ని నాని. వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఉదయం నుండి నిరోధిక నిరసన తెలియజేస్తున్న అంగన్వాడి టీచర్లకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని.
పల్నాడు జిల్లా, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి. అంగన్వాడీలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య మాటల యుద్ధం. ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు. సిఐటియు నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట సమస్య పరిష్కారిచేవరకు నిరసన చేస్తామంటున్న అంగన్వాడీలు. సీఎం డౌన్ డౌన్ అంటూ సిఐటియు నేతలు నినాదాలు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.
కుప్పంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ఐసిడిఏస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అంగన్వాడిలకు కనీస వేతనం అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.అంగన్వాడిల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ యూనియన్లతో చర్చించినా అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించలేదన్నారు.
పలాస లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. అడ్డుకున్న పోలీసులు, అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట. మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైటాయించి నినాదాలు తెలుపుతున్న అంగన్వాడీలు. ఆగదీ పోరాటం ఆకల మంటలు పోరాటం అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మా యొక్క కష్టాలు నీకు తెలియడం లేదా. ఏసీల్లో నీవు ఎండల్లో మేమా అంటూ ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు మంత్రి సిదిరి అప్పలరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ ఇలా ఎండలో రోడ్డుపైకి రావడం దురదృష్టకరమన్నారు. అంగన్వాడీలు రకరకాలుగా తమ నిరసనలు తెలియజేయడంలో తప్పు లేదని కానీ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచడం బాధాకరమన్నారు.
సిఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన 16వ రోజు సమ్మెలో భాగంగా బుధవారం ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన అంగన్వాడీలను వినుకొండ ఎమ్మెల్యే బోల్లా బ్రహ్మనాయుడు పార్టీ కార్యాలయం వద్ద సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డుకు అడ్డుగా భారీ గేట్స్ ఏర్పాటు చేసి అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఓటు కోసం ఇంటి దగ్గరికి వచ్చి అడిగిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసు చేత ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వినతి పత్రం తీసుకునే అంతవరకు వెళ్లేది లేదని ఎమ్మెల్యే కార్యాలయం ముందు అంగన్వాడీలు బైఠాయించారు.
కడప జిల్లా, తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 16వ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16 నెలలైనా తమ సమ్మెను విరమించబోమని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పిఏకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్వాడీల 11 డిమాండ్లలలో కొన్నింటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. వేతనాల పెంపు ఒక్కటే మిగిలింది, సంక్రాంతి తరువాత..
దానిపైనా సానుకూల నిర్ణయం తీసుకుంటాం. 5 నుంచి బాలింతలకు కిట్లు ఇవ్వాలి సహకరించండి. సంక్రాంతి తరువాత.. మరోసారి చర్చిస్తాం. అంగన్ వాడీ యూనియన్ నేతలతో.. ప్రభుత్వ బృందం వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా, అంగన్వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న 7 వేల నుంచి రూ.11,500కు పెంచలేదా? మినీ అంగన్వాడీల జీతం రూ.4,500 నుంచి రూ.7వేలు చేయలేదా? ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని మీలోనే కొంతమంది టీడీపీ, యెల్లొమీడియా శక్తులకు అమ్ముడిపోయి, మిమ్మల్ని రెచ్చగొడుతూ, మీకు లేనిపోని ఆశలు కల్పిస్తూ ఇలా ధర్నాలకు ఉసిగొల్పుతున్నారు.. ఈ ప్రభుత్వం అందరి మేలు కోరే ప్రభుత్వం అనేది మీరందరూ ఇన్నాళ్లు చూశారు. అదే నమ్మకంతో మన ప్రభుత్వనికి అండగా ఉండాలి అని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం అని ఎమ్మెల్యే అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు.





Total views : 150145