తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు. నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి పై మాటల దాడి. రిషితా రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలు, ఏర్పడు ఇంచార్జీ కిషోర్, పంపాలి మురళి మోహన్. టీడీపీ ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం అడ్డుపెట్టి రిషితా రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు. రిషితా రెడ్డిని ప్రచారం చేసుకోకుండా వైసీపీ ప్రచార రథంలో సౌండ్ పెంచిన వైనం. ప్రచార రథం పై ఉన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఫోటో ను చించి వేసిన వైసీపీ తాగుబోతులు.
Bojjala sudheer reddy
వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు నాలుగున్నర సంవత్సరంలో పేదలు, రైతులు ఇలా ఒకరిని కాకుండా ఎవరిది పడితే వారిది అక్రమంగా భూములు లాక్కొని తమ బినామీలకు సొంతం చేశారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపించారు టిడిపి శ్రీకాళహస్తి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తమ అనుచరులతో బినామీల రూపంలో కోట్లకు పడగలెత్తారని, పేద రైతుల డీకేటీ పట్టాలు ఉన్న వాటిని రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి తమ అనుచరుల పేరుమీద అక్రమంగా రాయించుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క రేణిగుంట మండలంలోనే దాదాపు 500 కోట్లకు పైగా భూకబ్జాకు పాల్పడ్డారని ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని అన్నారు. ఇందులో అధికారులకు అందరికీ పాత్ర ఉందని దీనిపై ప్రజలు ముందుకు వచ్చి పోరాడితే కానీ న్యాయం జరగదని, మీడియాను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని మండి పడ్డారు.
శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి టిడిపి నాయకులను వెంటబెట్టుకుని నిన్న ఉదయం శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులపై విరుచుకు పడ్డారు. ఈ తరుణంలో పోలీసులు 26 మంది పై ఆరు రకాల సెక్షన్లో కేసులు బనాయించారు.




Total views : 140751