బీట్ రూట్ జ్యూస్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు మందు, వ్యాయామం, సాల్ట్ షేకర్ తో పాటు ఓ గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగమని వైద్యులు చెబుతుంటారు. గ్లాసు రసం పోషకాహారాన్ని అందిస్తుంది. అంతేకాదు శక్తిని పెంచి వాపును తగ్గిస్తుంది. ఇస్కీమిక్ గుండె జబ్బులు, క్యాన్సర్‌ను కూడా నిరోధిస్తుంది. విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే పదార్థాలలో బీట్ రూట్ కూడా ఒకటి. మలబద్ధకం నుండి ఉపశమనానికి తోడ్పడతాయి. వివిధ కడుపు సమస్యలను తగ్గించే గుణం కూడా ఉంది. దీర్ఘకాలం నుంచి ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్రూట్ ఎంతో ప్రయోజనకరమైంది. 33 శాతం కీళ్లనొప్పుల సమస్యలు బీట్ రూట్ ను కొరకడం ద్వారా పరిష్కారమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర కూరగాయలతో పాటు దీన్ని కూడా సమానంగా ఉంచితే ఎంతో ప్రయోజనం ఉంది. వీటిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు. బీట్ రూట్ లోని వర్ణద్రవ్యం శరీరంలో క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీట్ రూట్ తినే అలవాటు ఉంటే ఆ ప్రమాదం తగ్గుతుంది. వీటిల్లో ఉండే నైట్రేట్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.
Calcium
రుచి అద్భుతంగా ఉండే చెరుకు రసంలో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్, కార్బొహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు చెరుకు రసం ద్వారా పొందొచ్చు. అందుకే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు. చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. చర్మానికి చెరుకు రసాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖంపై మొటిమలను తగ్గించడంలో చెరుకు రసం గ్రేట్‌గా సహాయపడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చెరుకు రసం మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే. క్రమంగా మొటిమలు మటుమాయం అవుతాయి. అలాగే చర్మ కాంతిని రెట్టింపు చేయడంలోనూ చెరుకు రసం ఉపయోగపడుతుంది.ఒక బౌల్లో చెరుకు రసం మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి. నెమ్మదిగా మసాజ్ చేయాలి.బాగా డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే. ముఖం కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది. ఇక చెరుకు రసాన్ని ముఖానికి డైరెక్ట్‌గా అప్లై చేసి.నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు వేళ్లతో మెల్ల మెల్లగా మసాజ్ చేసుకోవాలి.ఆ తర్వాత పావు గంట పాటు వదిలేసి. అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.చర్మంపై ముడతలు, సన్నని గీతలు పోయి ముఖం యవ్వనంగా, మృదువుగా మారుతుంది.
భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. దైవంతో సమానంగా కొలిచే ఈ తులసి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పరగడుపున ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే పలు శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఒక అడాప్టోజెన్. ఇందులో విటమిన్లు ఎ, సి, కాల్షియం, ఐరన్, జింక్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది. తులసి ఆకులను ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. తులసిని తీసుకోవడం వల్ల ఎక్కువ శారీరక శ్రమ, ఇస్కీమియా, శారీరక నిగ్రహం, చలి, శారీరక ఒత్తిడి నుండి అవయవాలు, కణజాలాలను రక్షించడంలో వరకు సహాయపడుతుంది. పరగడుపు తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. తులసి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోవాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. రిఫ్రెష్‌గా ఉండటానికి ఉదయాన్నే వీటిని తినండి. తులసి ఆకులలో అడాప్టోజెన్లు పుష్కలంగా ఉంటాయి. మీరు ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే, అది మీ రక్తం నుండి ట్యాక్సిన్లను బయటకు పంపుతుంది. ఇది మొటిమలు, మచ్చలను తగ్గించి మచ్చలు లేని చర్మాన్ని ఇస్తుంది.
శీతాకాలంలో సీజనల్ వ్యాధులు రావడం చాలా కామన్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడంద్వారా వాటి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. డ్రైఫ్రూట్స్ తినడం చాలా మంచిది. వీటిని తినడంవల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఖర్జూరం సహాయపడుతుంది. శీతాకాలంలో వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కాల్షియం, మినరల్స్, ఐరన్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి అధికంగా ఉంటాయి. ఖర్జూరం తింటే జలుబు, దగ్గు రావు. శీతాకాలంలో జలుబు, దగ్గు చేయడం సహజం. అయితే రోజుకు రెండుకానీ మూడుకానీ ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకుంటే వీటినుంచి ఉపశమనం పొందొచ్చు. జీర్ణక్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. తరుచుగా మలబద్దకంతో బాధపడేవారు వీటిని తీసుకోవాలి. వీటిల్లో అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణమయ్యాయి. ఖర్జూరాన్ని ప్రతిరోజూ తీసుకోవడంద్వారా కొంత ప్రయోజనం పొందొచ్చు. ఖర్జూరంలో కాల్షియం, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలుంటాయి. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఖర్జూరం వల్ల ఇంకా ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయి.
బెండకాయను ఫ్రై చేసిన కూరగా చేసిన పులుసుగా చేసిన ఏ కూరకు రాని రుచి వస్తుంది. అయితే కొంత మంది బెండకాయను జిగురుగా ఉంటుందని తినటం మానేస్తు ఉంటారు. శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు బెండకాయలో ఉన్నాయి. ఇప్పడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయ మధుమేహ రోగులకు సంజీవని అని చెప్పవచ్చు. బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి.ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Read Also..
Read Also..
అజీర్తి, అజీర్ణం పేరు ఏదైనా ఎక్కువమందిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్య. మంచి ఆకలి మీద ఆహారాన్ని తీసుకున్నా కొందరికి త్వరగా జీర్ణం కాదు. ఇలా జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే మంచిది. జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పరగడుపున ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటే మంచిది. అజీర్ణంతో పాటూ కడుపులో వికారం కూడా తగ్గిపోతుంది. అల్లం రసం తాగలేని వాళ్లు కూరల్లో కలిపి తినొచ్చు. ముడి బియ్యం, ఓట్స్, గోధుమలలాంటి తృణ ధాన్యాలతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది. కీరదోస వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఉండే కాల్షియం, ఫోలేట్, విటమిన్ సి, ఎరెప్సిన్‌లు శరీరానికి చల్లదనంతో పాటూ గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అరటి పండ్లు తింటే మంచిదే రోజూ ఆహారంలో ఓ అరటి పండు తీసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణసమస్యలను దూరం చేస్తాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం పోతుంది. పెరుగు కూడా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ పెరుగును తీసుకుంటే జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా పోయి మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా రావు. జీర్ణ సమస్యలకు కివీ పండ్లు కూడా చెక్ పెడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి జీర్ణ సమస్యలను పోగొడుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గిపోతుంది. పాప్‌కార్న్ తీసుకున్నా మంచిదే. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్ అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది.
మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుందని తెలిపారు. శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకోవచ్చు. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమినో యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా ఉపయోగపడుతాయని అంటున్నారు.
తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ , మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గాయాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది. గొంతులో గరగరలను తగ్గిస్తుంది. నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును, తేనేలో కార్బోహైడ్రేట్లు, నీరు, మినరల్స , విటమిన్స వుంటాయి. కాల్షియమ్, మాంగనీస్, పోటాషియమ్,ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి. తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి. ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది. రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి, జీర్ణం సులభం చేస్తుంది. తేనే ,దాల్చిన చెక్క పొడిని బ్రెడ్ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్ తగ్గుతుంది. రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్ రానివ్వదు. వేడినీటిలో ఒక స్పూన్ తేనే, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది. తేనే లో ఉన్నా విటమిన్స్ శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును, యాన్తి బ్యాక్తెరియాల్, యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన గాయాలు మానును. రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది. రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది. నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది. తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది. తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి.
Read Also..
Read Also..
ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి. ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగిఉంటాయి. శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు(పాలిచ్చే తల్లులు), పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ – సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడాఉంటాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు. వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గేందుకూ సహకరిస్తుంది. ఇందులో విటమిన్-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్, నారింజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితోపాటు, లైకోపిన్, బీటా కెరోటిన్, క్సాంథిన్, ల్యూటిన్ వంటి ఫ్లేవొనాయిడ్లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది. సి-విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 100 గ్రా. తాజా పండులో 135 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకూ రక్తపోటు అదుపునకూ ఇది ఎంతో ఉపయోగం. ఎరుపురంగులో ఉండే గ్రేప్ ఫ్రూట్లో లైకోపిన్ ఉండటంవల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచీ రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్‌కే ఎక్కువ. లిమోనాయిడ్లూ గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ముక్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి. ఇందులోని నారింజనిన్ అనే ఫ్లేవొనాయిడ్ దెబ్బతిన్న డి.ఎన్.ఎ.ను సైతం బాగుచేస్తుందట. ఇందులో కాల్షియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది వూబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధరించారు.





Total views : 140817