చిత్తూరు జిల్లా లోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల దొడ్డి వద్ద ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి, స్థానికుల సహాయంతో గాయపడిన వ్యక్తిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వీరి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
car accident
సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో ఓ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ (38) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మందస మండలం సిద్దిగాం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. కారు ముందు సీట్లో కూర్చున్న సురేంద్ర, చక్రి ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో బారువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బారువ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా కాజిపేట్ లో నిన్న గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను కారు ఢీకొట్టింది. కారు నెంబర్ TS03 FA9881. మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎక్సయిజ్ సిఐ శరత్ కొడుకు వంశీ. నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అధికారి కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, కవిత బంధువులు మరియు స్నేహితులును తిట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్లగొడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్లో ధర్నా చేపట్టారు.
అల్లూరి జిల్లా జీకే విధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్డులో ధర్మపురం వద్ద కారు బోల్తా పడింది. కారులో ఏడుగురు ప్రయాణిస్తుండగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ కాపీ తోట పనులు చేస్తున్న గిరిజన రైతులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను బయటకి తీసి దారకొండ హాస్పిటల్ కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రైవేట్ సెల్ టవర్ సిబ్బందిగా తెలుస్తుంది.
ఎన్ టి ఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కేతనకొండ గ్రామంలో తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో 8 మంది ప్రయాణిస్తుండగా అందులో ఇద్దరు చనిపోగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also..
నాగులప్పలపాడు మండలం ఓమ్మెవరం గ్రామానికి చెందిన గోగినేని హనుమంతరావు వయసు 43 సం అను అతను దరిశి గ్రామంలో ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తూ ఈరోజు ఉదయం తన విధులకు వెళ్ళుటకు ఓమ్మెవరం గ్రామం నుండి దరిశికి వెళుతూ నాగులుప్పలపాడు మండల పరిధిలోని హనుమాపురం కొత్తకోట గ్రామం సమీపంలో గల దొండవాగు వద్ద వాగు ఉదృతికి కారులో ప్రయాణిస్తున్న గోగినేని హనుమంతరావు కారుతో సహా వాగులో కొట్టుకొని పోయినాడు అంతట సదరు హనుమంతరావు చిల్ల చెట్లు పట్టుకొని నీటిలో చెట్టు సహాయంతో క్షేమంగా ప్రస్తుతం నీటిలోనే చెట్లలో ఉన్నాడు. ఫైర్ సిబ్బంది వచ్చి అతని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయుచున్నారు.
Read Also..
కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలవ్వగ నాలుగు ద్విచ్రవాహనాలు, ఓ ఆటో ద్వంసమయ్యాయి. డ్రైవింగ్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. దర్గా సెంటర్ నుండి స్టేట్ బ్యాంక్ కు వెళ్ళే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని స్థానికులు హుటహుటీన పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం… కడప జిల్లా కాశినాయన జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి పోరుమామిళ్ల వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు బయలుదేరారు. సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు నగర శివారులోని చెర్లోపల్లి వద్ద ఘటన. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి మైసూర్ కి వెళుతుండగా ఘటన.. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మహిళలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. డ్రైవర్ శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సిఎంసి ఆసుపత్రి కి తరలించారు. చిత్తూరు తాలూకా ఎస్సై ఉమామహేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదకటనపై విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న సిఐ గంగిరెడ్డి…



Total views : 140762