టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలో గిరిజనుల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని తెలిపారు. కాలనీలో రహదారి లేక రోజుల తరబడి బురదలోనే తిరిగామని వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని చంద్రబాబుకు వివరించారు. వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా విన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ ఎస్టీ కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.అంతేకాదు, టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
chandrababu
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు _ నారా చంద్రబాబు నాయుడు_ శుక్రవారం బాపట్ల పర్యటన కి రాబోతున్నారు. శుక్రవారం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో పిట్టలవానిపాలెం మండలం, మంతెనవారి పాలెం గ్రామం లో బాపట్ల నియోజకవర్గం లో ప్రవేశించి అనంతరం బాపట్ల నియోజకవర్గం లో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి అనంతరం రాత్రికి బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో బస చేసి శనివారం ఉదయం బాపట్ల నుండి బయల్దేరి పర్చూరు నియోజకవర్గం వెళ్తారు అని నరేంద్ర వర్మ తెలిపారు..
డా,, బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారు అని, అందుకే జగన్ అంటే నాకు అత్యంత గౌరవం అన్నారు. పేదల పక్షపాతి సీయం జగన్ అని కొనియాడారు. విద్యావిధానం రాష్ట్రం లో మంచిగా అమలు అవుతుందని, ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో ఇవాళ ఈ రాష్ట్రం లో ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల పై నారాయణ స్వామి స్పందిస్తు…తెలంగాణలో ఒక మతం పైనే అక్కడి రాజకీయం ఈ ఎన్నికలలో జరిగిందని, కేవలం కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గానే రాజకీయం జరిగిందని కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. దీనివల్ల పరోక్షంగా చంద్రబాబుకు మేలు, ఆ పార్టీ నాయకులకు ఆనందం జరిగింది అంతే తప్ప వేరే లేది కాదని ఎద్దేవా చేసారు. అభివృద్ధి ని అక్కడ అడ్డకుని కుతంత్రాలతో బీఆర్ ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారు అని ఆరోపించారు.ఇదంతా ఎల్లో మీడియా, చంద్రబాబు ప్లాన్… రేవంత్ రెడ్డి ఇప్పటి కీ టీడీపీ మనిషే అని ఆరోపించారు. వరద ప్రాంతాలలో సహాయ చర్యలు జరుగుతున్నాయని, తిరుపతి కాళహస్తి, గూడూరు ప్రాంతాలలో నష్టం జరిగిందని వాళ్లకి సహాయ చర్యలు జరుగుతాయని అన్నారు. రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఎక్కవుగా పంట నష్టం జరిగిందని వాళ్లకి అంచనా వేసి త్వరలో నష్ట పరిహారం చెల్లిఇస్తాం అన్నారు నారాయణ స్వామి. రైతులను ఆదుకుంటామని 20 రోజుల్లో నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఉచిత ఇసుక కేసులోనూ చంద్రబాబు పిటిషన్పై విచారణను డిసెంబర్ 12వ తేదీకే వాయిదా వేసింది. ఈ కేసులోనూ ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది : సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ !!!
2009 లో దర్శకుడు ఎన్. శంకర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు నాకు పరిచయం, అప్పటి నుండి ఆయనతో సన్నిహితంగా ఉన్నాను. నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డ్ నా పాటకు రావడం, ఆ అవార్డ్ ను చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. నాకు సొంత స్టూడియోను కూడా చంద్రబాబు గారు పెట్టించారు. 2014 లో రేవంత్ రెడ్డి అన్న తో పరిచయం ఆయన కోసం పాటలు చెయ్యడం జరిగింది, అప్పటినుండి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నాను. ఆ సమయంలో “తెలంగాణ పులిబిడ్డ నిన్ను మరవబోదు ఈ గడ్డ” సాంగ్ ను రాశాను, రేవంత్ రెడ్డి గారు జైల్ లో ఉన్నప్పుడు ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. తెలుగు దేశంలో ఉన్నప్పుడు, అలాగే కాంగ్రెస్ లో వెళ్ళినప్పుడు నేను ఆయనతో ఉన్నాను, అదే సమయంలో నన్ను వేరే వారు సాంగ్స్ చెయ్యమని అడిగినా కూడా నేను చెయ్యలేదు.
సందర్భం ఏదైనా రేవంత్ రెడ్డి అన్న నాతో పాట రాయించుకొనేవారు, అన్న పిసిసి అద్యేక్షుడు అయ్యే రోజు మూడు రంగుల జండా అనే పాటను రాయడం జరిగింది. పార్టీ జనాల్లోకి వెళ్ళడానికి ఈ పాట ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధి గారు ఈ సాంగ్ ను ఎంతో మెచ్చుకున్నారు. ఈ పదేళ్ళలో జరిగినవన్నీ రేవంత్ అన్న నాకు చెప్పారు, రాజకీయాలతో సంభంధం లేకుండా ఒక కళాకారుడిగా నేను రేవంత్ అన్నతో ఉన్నాను. ఈరోజు ఆయన విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది, ఇదంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని రచయిత, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు.
సినిమాల ద్వారా నేను నాలెడ్జ్ సంపాదించుకున్నాను, ఎంతో పేరు తెచ్చుకున్నాను, విమానం , భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో గుర్తింపు వచ్చింది. అలాగే ఇండిపెండెంట్ సాంగ్స్ తో ప్రజల్లో మంచి పేరు వచ్చింది. రేవంత్ అన్న ద్వారా నాలాంటి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. కళారంగం అభివృద్ధికి నా వంతుగా ప్రభుత్వం అండతో రచయితలు, కవులు, గాయకులను వెలికితీయలనేది నా కోరిక అని చరణ్ అర్జున్ అన్నారు.
రాష్ట్రంపై ‘మిచాంగ్’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని… ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా… ప్రభుత్వం తగు రీతిలో స్పందించలేదని అన్నారు. ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని… సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని… ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుఫాన్ బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. మరో వైపు మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో చంద్రబాబు శ్రీశైలం పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత దర్శించుకోవాలని అధినేత నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా వుంచితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ లభించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ మధ్యే తిరుమలలో శ్రీవారిని, విజయవాడలో కనకదుర్గమ్మ, సింహాచలంలో అప్పన్నను దర్శించుకున్నారు. త్వరలోనే శ్రీశైలం మల్లన్నతోపాటు కడప దర్గా, మేరీమాత చర్చిలను ఆయన సందర్శించనున్నారు. కాగా ఆలయాల సందర్శనకు వెళ్తున్న చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతాలు పలుకుతున్నాయి. భారీ ర్యాలీలతో అధినేతకు మద్దతుగా నిలుస్తున్నాయి.
ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది. ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు. చంద్ర బాబు హయాంలో ముస్లిం ల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. జగన్ హయాంలో అన్ని వర్గాల కు అన్యాయం చేశారు. సమాజంలో ముస్లిం ల పాత్ర కి ఒక గుర్తింపు ఉంది. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం కి ముస్లింలు సహకారం అందించాలి.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై విడుదలయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరయింది. హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టు కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన జనం బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని బాబు భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ లోపల కలిసేందుకు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి లేఖ రాయనున్నారు.
బొనమంద సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు. అవులపల్లి లో టిడిపి నాయకులు కబ్జా చేసుకున్న అటవీ భూములు పోతాయని అవులపల్లి రిజర్వాయర్ పై కేసులు వేశారు, చంద్రబాబు నాయుడు అవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో విష జ్వరాలు వస్తె తక్షణ చర్యలు తీసుకున్నాం అని, కలుషిత నీరు ఉందని తెలిసిన వెంటనే ఇక్కడ అర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశాం అన్నారు. ఎన్నికల లోపల బొనమంద, పేటూరు తదితర బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి ఉందని, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందని అన్నారు, వెయ్యి రూపాయల పైన ఎంత ఖర్చు అయినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని గుర్తుచేసారు, నాడు నేడు పాఠశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పేదల పై ఉన్న ప్రేమకు నిదర్శనం అని కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో జన్మభూమి కమిటీ చెప్పిన వారికే పథకాలు, పెన్షన్లు ఇచ్చేవారు అని, పేదల కోసం ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాత్రమే అన్నారు. వైసిపి వచ్చాక మనకు ఎంత మేలు జరిగిందో టిడిపి కార్యకర్తలు కూడా ఆలోచించాలి అన్నారు. గతంలో 100 పేజీల మానిఫెస్టో, 600 హామీలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేసారు.
మహిళా రుణాలు మాఫీ అని చెప్పి దగ చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఆ రుణాలు విడతలవారీగా చెల్లించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దన్నారు. మనంతా కలిసికట్టుగా గా సిఎం వైఎస్ జగన్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హాజరయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నేడు ఢిల్లీలో సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహం జరగనుంది. ఎల్లుండి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. చంద్రబాబు ఈ నెల 28 వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. కాగా, ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, చంద్రబాబు త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి రానున్నారని తెలుస్తోంది.




Total views : 141463