చెన్నూరు నియోజకవర్గం కన్నా ప్రజల సమస్యకన్న ఇసుక దందానే బాల్క సుమన్ కు ముఖ్యం అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మందమర్రి లొ గడప గడప కు కాంగ్రెస్ ప్రచారం లొ భాగంగా మాట్లాడుతూ… రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయి ఎంత వాటా వస్తుంది అనేదే సుమన్ లక్ష్యం. 2014 లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన పై పోటీ చేసినప్పుడు 100 కోట్లు వివేక్ వి 100 కేసులు నాయంటూ ప్రజలని మభ్యపెట్టిండు. Mp గా mla గా గెలిచి వెయ్యి కోట్లు బాల్క సుమన్ ఎట్ల సంపాదించిండని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను తెలుసుకుని బాల్క సుమన్ ను నిలదియ్యాలి. నేను ఏ పదవిలో లేనప్పటికి 10 ఏండ్లుగా ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటు అండగా ఉంటున్న ప్రజలకు సేవ చేసేందుకె చెన్నూరు అసెంబ్లీ బరిలో నిలుచుంటున్న హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సుమన్ అహంకారం తో ఆఫీసర్లను , నాయకులను, ప్రజలను తిట్టడం బెదిరింపులకు దిగడమే పని. పేదలకు డబులు బెడ్ రూమ్ లు ఇయలేదు గాని కేసీఆర్ తన mla, mp లకు పెద్ద బిల్డింగ్ లు కట్టి ఇచ్చిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..మందమర్రి మున్సిపాలిటీ కి ఎన్నికలు జరిపించేందుకు కృషి చేస్తాను అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా అని తన ఇంటికే ఆరు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. నెలకు 50 లక్షల జీతం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వస్తున్నాయి కేసీఆర్ బులెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకున్నాడు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇళ్ళలు, ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పెదలకేమో డబుల్ బెడ్ రూమ్ లు లేవు. ముఖ్యమంత్రి కి అహంకారం పెరిగింది.. అవినీతిలో మునిగిపోయిండు మీటింగ్ లో నెను ఎక్కడ మాట్లాడిన అక్కడ బాల్క సుమన్ మనుషులు కరెంట్ కట్ చేస్తున్నారు. పవర్ కట్ చేస్తే.. నా మాటలు మీ దాకా వినిపియ్యవా. ధరణి ,కాళేశ్వరం, మిషిన్ భగీరథ ఇలా ప్రతి దానిలో కోట్లు కొల్లగొట్టారు. కాంగ్రెస్ మేనిపెస్టో లొ ఆరు గ్యారెంటీ కార్డును ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అన్నారు.
congress
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తన ఊరిని రేవంత్ రెడ్డి కాపాడాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని చిత్తనూర్ లో ఇథనల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని, దీని వల్ల గ్రామానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడాలని వేడుకున్నాడు.
ఎంపీ, కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి’ అని అన్నారు. కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు నాశనం చేసుకోవద్దన్నారు. ఎన్ని సీట్లు వచ్చినా ఏర్పడేది BJP ప్రభుత్వమేనని, తెలంగాణలో కాంగ్రెస్కు 35 నుంచి 40 సీట్లు దాటే ప్రసక్తే లేదని ఆయన జోష్యం చెప్పారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర కార్యక్రమాని చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారం చేసారు.అనంతరం మాల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఇస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు (6) గ్యారంటీ స్కిమ్ పథకాలను ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసుగుతుంది. పాదయాత్ర లో భాగంగా ఆర్టీసీ బుస్ లో ప్రయాణికులతో ముచ్చటించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. మాల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ ప్రచారాలు హోరాహోరీగా నిర్వహించారు.
Read Also..
Read Also..
తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలనే ఆకాంక్ష సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం. అందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాలనే మొదలగు అంశాలతో కూడిన తమ ఎజెండాను కాంగ్రెస్ పార్టీకి సమర్పించాం. ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, అమరవీరుల కుటుంబాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్న తమ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అందుకే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో చివరివరకు పొత్తుకు ప్రయత్నించి విఫలమైన సీపీఎం తాజాగా తమ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు. తమకు పట్టున్న 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ఇది వరకే ప్రకటించిన సీపీఎం 14 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. నేటి సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. భద్రాచలం అభ్యర్ధిగా కారం పుల్లయ్య, అశ్వారావుపేట అభ్యర్ధిగా పిట్టల అర్జున్, పాలేరు అభ్యర్ధిగా తమ్మినేని వీరభద్రం, మధిర అభ్యర్ధిగా పాలడుగు భాస్కర్, వైరా అభ్యర్ధిగా భూక్యా వీరభద్రం, ఖమ్మం అభ్యర్ధిగా ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లి అభ్యర్ధిగా మాచర్ల భారతి, మిర్యాలగూడ అభ్యర్ధిగా జూలకంటి రంగారెడ్డి… ఇక నకిరేకల్ నియోజకవర్గానికి చినవెంకులు, భువనగిరి నియోజకవర్గానికి కొండమడుగు నర్సింహను, జనగామకు మోకు కనకారెడ్డిని, ఇబ్రహీంపట్నంకు పగడాల యాదయ్య, పటాన్చెరు నియోజకవర్గానికి జే. మల్లికార్జున్ ను, ముషీరాబాద్ నియోజకవర్గానికి ఎం.దశరథ్ ను ఖరారు చేశారు.
ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.
Read Also..
Read Also..
నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ముఖ్య అనుచరులు, ప్రజాప్రతినిధులు అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ అనునిత్యం చేదోడువాదోడుగా ఉంటున్న సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మరి కొంతమంది నాయకులు కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటున్న నాయకులు కాంగ్రెస్ లో చేరికతో ఎమ్మెల్యే షాక్ లో ఉన్నారు. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురులేదనుకొని ధీమాగా ఉన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి ఒక్కసారిగా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తన అనుచరుల్లో ఇలాంటి అయోమయం ఉందో తేరుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే మర్రి ఉన్నారు. నిన్నటి వరకు ఎదురులేద్దనుకొని ధీమాగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డికి తన అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది. గెలుపు ధీమాలో ఉన్న మర్రికి పరిస్థితి పట్టడం లేదు. బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడంతో నాగర్ కర్నూలు జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
జనగామ జిల్లా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాపరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ BRS పార్టీ తెలంగాణ మోసం చేసిందని కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దండుకున్నారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ 2018 ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదని అన్ని మోసపూరిత హామీలు ఇస్తుందని మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.




Total views : 141483