దక్షిణ భారతదేశంలో ట్రేడ్‌మార్క్ పొందిన తొలి భవనంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల. భాగ్యనగరం చరిత్రలో అంతర్భాగమైన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అరుదైన గుర్తింపును దక్కించుకుంది. 1939లో నిర్మించిన ఈ భవనం జాతీయ స్థాయి మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది. మన దేశంలో ట్రేడ్ మార్క్ గుర్తింపు ఇప్పటి వరకు ముంబయిలోని హోటల్ తాజ్ మహల్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాలకు మాత్రమే ఉండగా.. దక్షిణ భారతదేశంలో ట్రేడ్ మార్క్ పొందిన తొలి భవనంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి గుర్తింపు లభించనుంది. ట్రేడ్ మార్క్ వచ్చాక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్ ను వ్యక్తులు గానీ.. సంస్థలు గానీ వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు వీలుండదు. టీ కప్పులు, మగ్గులు, బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫొటోలను ముద్రించే వీలు ఉండదు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మరో నాలుగైదు నెలల్లో రానుందని వర్సిటీ అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై విశ్వవిద్యాలయం అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కీలకంగా సమావేశం కానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ మరోసారి చర్చించనుంది. అసెంబ్లీలో మార్చి నెలలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న…
- బొల్లారం ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు విచారణ.హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు నిందితుడు మల్లేష్ పోలీసుల విచారణను ఎదుర్కోనున్నాడు. కోర్టు అనుమతితో మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన…
- గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఘటనకు అధికారుల నిర్లక్ష్యం కారణమా.. లేక దుండగుల చర్యనా అనే కోణాల్లో విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధ్యులు ఎంతటి…
- ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత కలవరం రేపుతోంది..! ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరాన్ని వణికించేందుకు దూసుకొస్తోంది తీవ్ర వాయుగుండం..! గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ.. ప్రస్తుతం కళింగపట్నానికి కేవలం 100…
- అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి