కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యా, వైద్యమేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్యశాఖ బలోపేతం అయిన రోజే ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వైద్యారోగ్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశామని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ ఉత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నది నియామకాల కోసం మాత్రమే. గత పదేళ్లల్లో నిరుద్యోగుల ఆకాంక్షలను బీఆర్ఎస్ పక్కకు పెట్టింది. ఇచ్చిన నోటిఫికేషన్లు ఇస్తే పేపర్లు లీక్ అయి, జిరాక్స్ సెంటర్లలో తేలితే.. పట్టించుకునే దిక్కు లేకుండా నిరుద్యోగులను వదిలేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేయలేదని, ఆ ఘనత కేవలం తమకు మాత్రమే దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇవాళ ఎథిక్స్ కమిటీ భేటీ.తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కీలకంగా సమావేశం కానుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ మరోసారి చర్చించనుంది. అసెంబ్లీలో మార్చి నెలలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారన్న…
- బొల్లారం ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు విచారణ.హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో నేడు రెండో రోజు నిందితుడు మల్లేష్ పోలీసుల విచారణను ఎదుర్కోనున్నాడు. కోర్టు అనుమతితో మల్లేష్‌ను పోలీసులు 10 రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన…
- గోరుకల్లు గ్రామంలోకి ఒక్కసారిగా పోటెత్తిన నీటి ప్రవాహం.నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఘటనకు అధికారుల నిర్లక్ష్యం కారణమా.. లేక దుండగుల చర్యనా అనే కోణాల్లో విచారణ జరిపిస్తున్నామన్నారు. బాధ్యులు ఎంతటి…
- ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం.బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత కలవరం రేపుతోంది..! ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరాన్ని వణికించేందుకు దూసుకొస్తోంది తీవ్ర వాయుగుండం..! గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ.. ప్రస్తుతం కళింగపట్నానికి కేవలం 100…
- అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి