మరో వారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి, ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. తొలి దశలో రోజుకు రెండు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే కేడర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రెండో దశలో రాష్ట్రమంతా మరోసారి పర్యటించనున్నట్టు సమాచారం.
elections
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి లో కార్మికుల యూనియన్ ఎన్నికలు ఉదయం 07 గంటల నుంచి ప్రారంభమైనాయి. సత్తుపల్లి లోని JVR ఓసి, కిష్టరం ఓసి, కోల్ ట్రాన్స్పోర్ట్ ఏరియా లలో పని చేసే సింగరేణి కార్మికులు 984 మంది ఈ రోజు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి సింగరేణి లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న TGBKS యూనియన్ కాస్తా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC లో భారీగా కార్మికులు చేరడం జరిగింది. దీంతో ఇక్కడ INTUC యూనియన్ బలంగా ఏర్పడి సింగరేణి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు ఆయా యూనియన్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. కార్మిక సంఘాల మధ్య ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి.
కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం, గడిచిన 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది. రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా అడుగులు వేస్తుంది. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా, అసలు కార్మికుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయని సంఘం, కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే ఒక్కసారి కూడా ఇటు వైపు చూడని సంఘం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని గెలుపు కోసం అడ్డమైన దారులు తొక్కుచున్నది. కార్మిక సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి కార్మికుల బాగు కోరే సంఘం ఏదో, స్వలాభం చూసుకునే సంఘం ఏదో. మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన కోసం ఎంతో మంది అమర నాయకులు సాధించి పెట్టిన హక్కులు మన దగ్గర ఉన్నాయి. అవి మన దగ్గర ఉన్నంత సేపు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు.
భయం అనే సంక్కెళ్లు తెంచుకొని ఒక్క అడుగు ముందుగా వేసిచూడు నీ బలం ఏంటో నీకే తెలుస్తుంది. నీ వెనుక ఎర్ర జెండ ఉంది, నీకు అండగా AITUC నాయకులు ఉన్నారని సీతారామయ్య అన్నారు. ఆలోచించు మన హక్కులను కాపాడుతూ సింగరేణి ని కాపాడే మన AITUC ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. AITUC గెలుపు సింగరేణి కార్మికుని గెలుపు నక్షత్రం చుక్క గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అని కోరారు.
Read Also..
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో గెలుపే లక్ష్యంగా యూనియన్లు హామీలను కార్మికుల గనుల పై స్థానిక ఎమ్మెల్యేలు, యూనియన్లు ప్రచారం నిర్వహిస్తున్నాయి. సింగరేణి గుర్తిపు సంఘం ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC ఆధ్వర్యంలో శ్రీరామ్ పూర్ ఏరియా ఆర్కే 7, 7A గనులు వర్క్ షాప్ ల వద్ద ప్రచారం నిర్వహించారు. గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రచారం లో కార్మికులను కోరారు. ఆయన వెంట సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో 13 యూనియన్లు బరిలో నిలిచాయి.
అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత, ఇతర అంశాలపై చర్చించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే నిజాయితీగా ఉంటూ, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. అలా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఒక్కరే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కచ్చితంగా పోటీ చేస్తారని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్దం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 18 కి వాయిదా వేసింది.
ప్రజా ఓటుతో కాకుండా మోసపూరితమైన ఓటుతో వైకాపా మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల్లో వేలకు వేలు తెదేపా సానుభూతి పరుల ఓట్లు ఫారం 7 ద్వారా తొలగించేందుకు వైకాపా నాయకులు కుట్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని నారాయణరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల మాటలకు అధికారులు తలోగ్గి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిజమైన ఓటరు ఎక్కడున్నా వచ్చి ఓటు వేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈనెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే 2ఏ బొగ్గు గనిపై అర్జీ1 నాయకులు హరిన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు బిఎంఎస్ కృషి చేస్తుందని అన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని 27న జరిగే గుర్తింపు ఎన్నికల్లో “కాగడా” గుర్తుకు ఓటు వేసి బిఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎందుకిలా చేశారో.. ఎవరికీ అర్థం కాలేదు. తమ సత్తా చూపించుకోవడానికో.. లేదంటే ట్రెండ్ క్రియేట్ చేయడానికో తెలియదు గానీ.. రెండేసి స్థానాల్లో పోటీలో నిలబడ్డారు. ఇంతకీ వారెవ్వరో ఈ పాటికే అర్థమైపోయింటుంది. ఒకరు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మరొకరు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఇంకొకరు బీజేపీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఈ ముగ్గురూ రెండేసి స్థానాల్లో బరిలోకి దిగి ప్రత్యేకతను చూపించారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రాక ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సీఎం కేసీఆర్ సవాళ్లు విసిరారు. మరోవైపు.. ప్రస్తుతం ఉన్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు కీలక ప్రకటనే చేశారు. ఈ ప్రకటనతో విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ఓటమి భయంతోనే కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తున్నారని విమర్శించాయి. అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీఆర్ఎస్కు ధీటుగా ఎత్తుకు పైఎత్తు వేసి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించేందుకు హస్తం పార్టీ తరపున రేవంత్‌రెడ్డిని కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దింపింది. ఇక్కడ కేసీఆర్‌కు రేవంత్ గట్టి పోటీ ఇచ్చారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌కు మంచి ఓటు బ్యాంక్ ఉంది. పైగా సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా 1983లో టీడీపీ స్థాపించన దగ్గర నుంచీ.. కామారెడ్డిలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే గెలుచుకుంటూ వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లన్నీ హస్తం పార్టీకి డైవర్ట్ అయినట్టుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా రేవంత్‌కు బాగానే కలిసొచ్చాయి. దీనికి తోడు కామారెడ్డిలో రేవంత్ గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పటికే కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయి బీజేపీ తరఫున పోటీచేసిన వెంకట రమణారెడ్డి పక్కాగా గెలుస్తారని సర్వేలు తేల్చేశాయి. ఇక తామేమీ తక్కువ కాదంటూ బీజేపీ కూడా ఈటల రాజేందర్‌ను రెండు చోట్ల బరిలోకి దింపింది. ప్రస్తుత నియోజకవర్గం హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీలో నిలబెట్టింది. ఇక్కడ ముదిరాజ్ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. ఈటల కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీజేపీకి గంపగుత్తగా ఓట్లు పడతాయని కమలం పార్టీ ధీమాగా ఉంది. అటు నేచురల్‌గా బీజేపీకి వచ్చే ఓట్లు కాకుండా ముదిరాజ్ ఓట్లు కూడా తోడైతే ఈటల సునాయసంగా గెలుస్తారని పువ్వు పార్టీ అంచనా వేసింది కానీ ఫలితం ఎలా ఉంటుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అటు కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి.. ఇటు గజ్వేల్‌లో ఈటల రాజేందర్.. ఇలా రెండు చోట్ల సీఎం కేసీఆర్‌కు గట్టి సవాల్‌ను విసిరారు. గజ్వేల్‌లో ఎలాగున్నా.. కామారెడ్డిలో మాత్రం కేసీఆర్‌కు ఓటమి తప్పదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ హిస్టరీలో ఇదే బిగ్ షాకే. ఇక ఈ ముగ్గురిలో రెండు చోట్ల గెలిస్తే మాత్రం.. ఒకదానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 6 నెలల్లో ఏదొక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం. మరీ… ఓటర్లు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారో.. తేలిపోనుంది.





Total views : 141322