బాపట్ల పట్టణము 33వ వార్డులో గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి స్థానికులతో ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్థలం అని వారిని ఖాళీ చేయాలనీ చెప్పటం తో అక్కడి ప్రజలకు ఏంచెయ్యాలో అర్ధం కావడం లేదు. ప్రజల సమస్యను తెలుసుకున్న వేగేశన నరేంద్ర వర్మ వారికీ ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. వారు నివాసం ఉంటున్న స్థలాలకు నివేశన పట్టాలు ఇచ్చి మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.
guntur district news
యువగళం పాదయాత్ర సభ దిగ్విజయం అయిన సందర్భంగా టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకానికి నాంది పలికిందన్నారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలుగజేసిన ఈరోజు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిందని ఆయన అన్నారు. యువగళం పాదయాత్ర లో ప్రతి 100 కిలోమీటర్ల చొప్పున ఒక హామీని శిలాపలక రూపంలో వేశారు అది అక్షరాల నిర్వహించే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. 92 నియోజకవర్గాలలో 3,152 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్ గారికి అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర లో వైసిపి చేసిన అరాచకాలను, అసమర్ధ పాలన గురించి నారా లోకేష్ ప్రజలకు తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశలో నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బహిరంగ సభకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్, ఐదు లక్షల మంది ప్రజలు విచ్చేసి ఈ సభను విజయవంతం చేశారు. వీళ్ళందర్నీ ఓకే వేదిక పైన చూడడంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు అని ఆయన ఎద్దేవాచేశారు.
బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో హర్ష ఎంటర్టైన్మెంట్, పిక్చర్ టైం వారి బెలూన్ థియేటర్ను ఈరోజు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని 120 సీట్ల సామర్థ్యం గల బెలూన్ థియేటర్ బాపట్ల లో పెట్టడం చాలా సంతోషదాయకం అని అన్నారు. ఈ థియేటర్ అత్యధిక టెక్నాలజీతో పనిచేస్తుందని ఇలాంటి టెక్నాలజీ గల థియేటర్లు మరెన్నో బాపట్ల జిల్లాలో రావాలని ఆయన అన్నారు. థియేటర్ యజమాని కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో వేరే రాష్ట్రాల్లో బెలూన్ థియేటర్లు చూసి మాకు కూడా బాపట్ల జిల్లా కొత్తగా వచ్చిన తరుణంలో పర్యాటకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనే, సూర్యలంక రోడ్డులోని మెయిన్ రోడ్డుకు ఆనుకొని మా సొంత స్థలంలో థియేటర్ పెడితే బాగుంటుందని, ఆ థియేటర్ కూడా కొత్త టెక్నాలజీతో బెలూన్ థియేటర్ పెట్టాలని మేము అందరి సహకారంతో బెలూన్ థియేటర్ బాపట్లలో పెట్టామని, ఈ బెలూన్ థియేటర్ను బాపట్లలోని ప్రేక్షకులందరూ ఆదరించాలని ఆయన అన్నారు.
బాపట్ల జిల్లా రేపల్లెలో అంగన్వాడిలు చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలియజేయడం జరిగింది. 9వ రోజు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరంలో చెవిలో పూలు పెట్టుకోని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జే. ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని జీతాలు పెంచలేమని చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయమంటాం, పెన్షన్ ఇవ్వమనటం, రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వమనటం, నేరం అన్నట్లు ప్రచారం నిర్వహిస్తామన్నారు. మేము అడిగేది న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం పట్టు విడవకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన కొనసాగించినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాబోయే కాలంలో కలెక్టరేట్లు ముట్టడిస్తామని, ఛలో విజయవాడ నిర్వహిస్తామని ప్రభుత్వం స్పందించాలని అంగన్వాడీలను భయభ్రాంతులను చేయటం విరమించుకోవాలని అన్నారు.
బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీలు చిలక జోస్యం చెప్పించారు. బాపట్ల ఐసిడిఎస్ ఆఫీస్ ముందు బైఠాయించి అంగన్వాడీలు, టీచర్లు, ఆయాల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఎనిమిదో రోజు సమ్మె సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చిలక జోస్యం చెప్పించి అంగన్వాడీలు వినూత్న ధర్నా నిర్వహించారు. చిలక జోస్యం లో ఇకనైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని చిలక యజమానిచేత చెప్పించారు. ఈ చిలక జోస్యం కార్యక్రమాన్ని దారిన పోయే ప్రజలు, అధికారులు, స్కూలు పిల్లలు, కాలేజీ విద్యార్థులు విద్యార్ధినిలను విశేషంగా ఆకర్షించింది. ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని నినాదాలు చేసారు. అనంతరం రోడ్డుపై మోకాళ్ళ మీద కూర్చొని అంగన్వాడీలు నిరసన తెలిపారు. తల్లుల తకాల సేకరణ చేపట్టిన అంగన్వాడీలకు మద్దతుగా నిలిచిన సిఐటియు నాయకులు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నాలో పాల్గొన్న జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లాల అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, జనసేన, టిడిపి కార్యకర్తలు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ను చెప్పారు.
- అంగన్వాడీ కార్యకర్తలకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గౌరవ వేతనాన్ని తెలంగాణ కంటే ఎక్కువ తప్పనిసరిగా ఇవ్వాలి.
- అంగన్వాడి న్యాయమైన డిమాండ్ సాధనలో ఎల్లప్పుడు జనసేన టిడిపి కూటమి మీ వెంట ఉంటుందని అన్నారు.
- ఒక సీఎం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన మాట తప్పడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
- మాట తప్పను మాడిమ తిప్పను అన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజున అంగన్వాడీ కార్యకర్తల విషయంలో మాటతప్పి మాడెమ తిప్పడని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమ్మె విరమించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అమరావతి ఉద్యమం కీలక దశకు చేరుకుందని, అందరూ ఐక్యంగా నడిచి జగన్ను గద్దె దించాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. వచ్చే మూడు నెలలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, అందరం పట్టుదలతో పనిచేసి అమరావతి కంటకులను ఇంటికి పంపిద్దామని ప్రతినబూనారు. సడలని సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతులు, మహిళలకు సంఘీభావాన్ని ప్రకటించారు. అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు అయిన సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరంలో రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ ఉద్యమానికి తాము వెన్నుదన్నుగా ఉంటామని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. రైతు గుండె పగిలి నేటికి నాలుగేళ్లు అయ్యిందంటూ జ్ఞాపకాలు స్మరించుకున్నారు. శిబిరంలో రైతు జెండాకు వందనం చేసి, ఆకుపచ్చ బెలూన్లు ఎగురవేశారు. అనంతరం నిరసన దీక్షలు చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలి, జగన్ నమ్మకద్రోహానికి 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. సకాలంలో వార్షిక కౌలు చెల్లించలేని, చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అధికారులకు దడ పుట్టిస్తున్న బాపట్ల జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష. జిల్లా అంతట ప్రభుత్వ అధికారుల ఆఫీసులు, ఏరియా ఆసుపత్రులు, సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేసి అధికారుల పని తీరు మార్చుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష హెచ్చరించారు. బాపట్ల పట్టణంలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి వైద్యశాలలో వసతులు ఎలా ఉన్నాయని పేషంట్లను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ అందించే సేవలు ఎలా అందుతున్నాయని రోగులని అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఏరియా వైద్యశాలలోని వైద్య పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించి వైద్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొన్ని అవసరమైన పరికరాలు ఎందుకు అందుబాటులో లేవని వైద్యుల్ని ప్రశ్నించారు. బాలింతల వార్డులో సరైన వసతులు లేవని బాలింతలు కలెక్టర్కు చెప్పగా వైద్యులను బాలింతల వార్డులో సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు. బాపట్ల ఏరియా వైద్యశాల సూపర్నెండ్ సిద్ధార్థ ను రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. బాపట్ల విజయలక్ష్మి హాస్పటల్లో వసతుల గురించి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వసతులు కల్పించడంలో కానీ వైద్య సేవలు అందించడంలో గాని సిబ్బంది నిర్లక్ష్యము వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కూడా ఏరియా వైద్యశాల తనిఖీల సమయంలో పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి పల్నాటి వీరరాధనోత్సవాల్లో మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు కరువుకోరల్లో చిక్కుకుందని కానీ ప్రభుత్వం పల్నాడు ను కరువు మండలంగా ప్రకటించకపోవడం దారుణమని ఆయన బాధపడ్డారు. తక్షణమే పల్నాడు ప్రాంతాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు. రైతుల రుణాలు రద్దు చేసి కొత్త రుణాలను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్నికోరారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజలు అంతం చేయాలని రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రజలు బుద్ది చెప్పకపోతే భవిష్యత్ అంధకారంలోకి వెళుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు. మాచర్ల నియోజకర్గంలో బానిస సంకెళ్లు తెంచడానికి ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అడుగడుగునా ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తూ అహర్నిశలు కష్టపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టి ఆ సంక్షేమ పథకాలలో 98 శాతం పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రి అని ఆయన తెలిపారు. జగన్ బాటలోనే అడుగులు వేస్తూ చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వైద్య రంగానికే వన్నెతెచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని గురించి కనీసం ఆమె పేరు తలచుకునే హక్కు కూడా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కి లేదని రాజేష్ నాయుడు, పుల్లారావుపై మండిపడ్డారు. రజిని ప్రజలకు చేసే మంచి చూసి ఓర్వలేక పుల్లారావు నోటికి ఏది వస్తే అది మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతి అనే పదానికే తావు లేకుండా రజిని స్వచ్ఛమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారన్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం దోచుకున్న చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు. ఇసుక, మైనింగ్, రైస్, గ్రానైట్ తదితర వాటిల్లో అందిన కాడికి అవినీతి సొమ్ము దోచుకున్నారని రాజేష్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో విడదల గోపీనాథ్, కాట్రగడ్డ మస్తాన్రావు, ముక్తా వాసు, వలేటి హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్ రఫాని, బేరింగ్ మౌలాలి, మరియు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





Total views : 140818