గత మూడు రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు సుమారు లక్ష పదివేల మంది రోడ్డుమీద నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. తమ ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తమ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు, తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాగైనా అంగన్వాడీల సమ్మెను విఫలం చేయాలని ఆలోచనతో ఈరోజు బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలో ఎస్టి కాలనీలోని తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ సెంటర్ ను బలవంతంగా సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో తదితర సిబ్బందితో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్ ను తెరిచారు. ఈ విషయం తెలుసుకున్న అంగన్వాడీ సిబ్బంది అధికారులపై మండిపడ్డారు. తమ అనుమతి లేకుండా తమ సెంటర్ తాళాలు పగలగొట్టి తెరవడం అన్యాయమని ఆ సెంటర్లోని వస్తువులు మా వ్యక్తిగత ఫైళ్లు ఉంటాయని వాటికి ఏమైనా నష్టం వాటిల్తే ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు అన్నారు. బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలోని అంగన్వాడి సెంటర్ లో కోడ్ నెంబర్ 20 ఎస్టి కాలనీ అంగన్వాడీ వర్కర్ ఆయా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో దగ్గరుండి తాళాలు పగలగొట్టి సెంటర్ ను తెరిపించారు.
guntur district news
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని 12 , 13 వార్డులలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా యరపతినేనికి స్థానిక టీడీపీ , జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు గడప గడపకు వెళ్లి రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు కార్యక్రమంలో భాగంగా మహిళలు కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అందులో భాగంగానే సంవత్సరానికి 4 సిలిండర్లను అందిస్తున్నారని వారు తెలిపారు. దాంతో పాటు గురజాల నియోజకవర్గం మొత్తానికి రేపు అధికారంలోకి రాగానే మరొక సిలిండర్ కూడా ఇవ్వబోతున్నట్లు యరపతినేని తెలిపారు. జనసేన మరియు టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని వారు తెలిపారు. రేపు రాబోయే ఎన్నికల్లో టిడిపి మరియు జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని వారు కోరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు (Mallela Rajesh Naidu)
చిలకలూరిపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు పేరు ఖరారు చేస్తూ అధిష్టానం సోమవారం నాడు ప్రకటించింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. మల్లెల రాజేష్ నాయుడు అభిమానులు ఆనందోత్సాహాలతో టపాకాయలు పేలుస్తూ పేట ప్రాంతాన్ని సువర్ణ కాంతులతో వెలిగిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పవన్ ఫ్యామిలీ జోలికి వస్తే పగిలిపోద్ది..నాగబాబు మాస్ వార్నింగ్ | Nagababu Mass Warning To YCP | CVR
పల్నాడు జిల్లా కలెక్టర్ ని కలిసిన టీడీపీ నేతలు జివి ఆంజనేయులు, జూలకంటి బ్రమ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు జిల్లాలో ఓట్ల అవకతవకలపై కలెక్టర్ కి ఫిర్యాదు…..
మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ
BLO ల మీద వైసీపీ నేతలు ఒత్తిడి చేసి మా ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, అధికారులు మా ఫిర్యాదులపై కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. మత్తుకుమల్లిలో బ్రతికున్న నలబై మంది ఓట్లు తొలగించారని, తొలగించిన ఓట్ల గురించి మేము పూర్తి ఆధారాలతో పిర్యాదు ఇస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు భారీ ఎత్తున ఓట్ల అవకతవకలకు పాల్పడ్డారని, వైసీపీ నేతలు ఫిర్యాదు ఇవ్వగానే వెంటనే మా ఓట్లను అధికారులు తొలగిస్తున్నారని ఆయన అన్నారు. వెల్లటూరు గ్రామంలో వైసీపీ నేతలు 160 దొంగ ఓట్లను చేర్చారని, ఓటమి భయంతోనే అధికార పార్టీ వారు దొంగ ఓట్లను చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. తప్పలు చేసిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నూతన జాబితాలో మాకు అన్యాయం జరిగితే తప్పకుండా మేము కోర్టుకి వెళతామని, ఇప్పుడు తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టమని ఆయన తెగేసి చెప్పారు.
మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రమ్మారెడ్డి మాట్లాడుతూ
మేము దొంగ ఓట్లపై ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదనిం, ఓట్ల విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. మా ఓట్ల విషయంలో అధికారులు న్యాయంగా వ్యవహరించడం లేదని, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు, మేము గడిచిన ఆరు నెలలుగా దొంగ ఓట్లపై పోరాటం చేస్తున్నా అధికారులు స్పందిoచడం లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఓటర్ లిస్ట్ వ్యవహారం జరుగుతుందని ఈరోజు ఉన్న ఓటు రేపు ఉంటుందో లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఓట్లపై సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని మీ ఓటుపై మీరు జాగ్రత్త పడితే మంచిదని ఆయన అన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన షాది ఖానాను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్దేవరాయలు , ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అతిధులకు స్థానిక నాయకులు , కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కాసు , ఎంపీ లావు కలసి షాది ఖానాను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పలనాడు జిల్లాలో మొట్టమొదటి ఏసి షాదీ ఖానాను దాచేపల్లిలో నిర్మించామని వారు తెలిపారు. ముస్లింల దశాబ్దాల కల అయినా షాది ఖానా ను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లిని మున్సిపాలిటీ చేశామని , దాచేపల్లి కి ప్రధాన సమస్య అయిన కాటేరు వాగు సమస్యని పరిష్కరించామని వారు తెలిపారు. గతంలో టిడిపి హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయలేని పని ఎమ్మెల్యే అయిన నేను చేసి చూపించానని వారు తెలిపారు. 16 కోట్ల రూపాయలతో ఇంటింటికి త్రాగునీరు పథకాన్ని తెచ్చామని వారు తెలిపారు. పార్టీలకి కులాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని వారు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు _ నారా చంద్రబాబు నాయుడు_ శుక్రవారం బాపట్ల పర్యటన కి రాబోతున్నారు. శుక్రవారం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో పిట్టలవానిపాలెం మండలం, మంతెనవారి పాలెం గ్రామం లో బాపట్ల నియోజకవర్గం లో ప్రవేశించి అనంతరం బాపట్ల నియోజకవర్గం లో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి అనంతరం రాత్రికి బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో బస చేసి శనివారం ఉదయం బాపట్ల నుండి బయల్దేరి పర్చూరు నియోజకవర్గం వెళ్తారు అని నరేంద్ర వర్మ తెలిపారు..
వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 40 కాసుల బంగారం,1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు. తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన వీరభద్రరావు సోమవారం సాయంత్రం 4 గంటలకు భార్యతో కలిసి గుడారి గుంట అత్తవారింటికి వెళ్ళి ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో సర్పవరం పోలీసులకు వీరభద్రరావు సమాచారం అందించాడు. చోరీ జరిగిన ఇంటిని సర్పవరం సి ఐ మురళి కృష్ణ, మరియు కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణ రెడ్డి, క్రైమ్ డిఎస్పీ రాంబాబు, ఐటి కోర్ శ్రీనివాస్ పరిశీలించారు.
“మిచాంగ్ తుఫాన్” ప్రమాదంగా ఉండటంతో నిజాంపట్నం హార్బర్ లోనే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, 10వ నెంబర్ ప్రమాద సూచిక అతి తీవ్రమైన వాతావరణం, భారీ గాలులు, వర్షాలతో కూడి నిజాంపట్నం తీర ప్రాంతానికి తుఫాను తాకే ప్రమాదం ఉందని సూచిస్తుంది. గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లోని పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన సందర్భం లేదు. ఈ పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచనకు నిజాంపట్నం తీరప్రాంతాలైన గ్రామాలు ముప్పుకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో సముద్ర అలల ఉప్పెన గ్రామాల్లోకి పొంచి వచ్చే ప్రమాదం కూడా ఉందని ఈ పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక ద్వారా గుర్తిస్తారు..
బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీరాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు మచిలీపట్నం తీరాల మధ్యలో తీవ్ర వాయుగుండంగా మారే తరుణంలో, బాపట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత రెండు రోజులుగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన అన్నారు. నెల్లూరు మచిలీపట్నం చీరాల మధ్యలో అంటే బాపట్ల ఉందని ఐఎండి హెచ్చరికల్ని పద్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సముద్రంలో ఎవరూ లేకుండా చూడాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశించమని అన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఇపత్కర పరిస్థితి అయినా ఎదుర్కోటానికి బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన బాపట్ల కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా సముద్ర తీరా ప్రాంతాల్లో ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన రెస్క్యూ టీం పోలీస్ శాఖలు సంసిద్ధంగా ఉన్నాయని ఆ న్నారు.ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితిలు జరిగిన పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎటువంటి సహాయం అందించడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు భయాందోళన గురికాకుండా అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి, ప్రభుత్వ ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో తల దాచుకోవాలని ఆయన అన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుండి మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చ్చేశారు. అగ్నిప్రమాదంలో సుమారు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరు నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్న క్రమంలో నరసరావుపేట మెయిన్ బ్రాంచ్ అని తెలిపారు. అగ్నిప్రమాదం సంభవించిందని తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మంటలు నిలుపుదల చేసేందుకు పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చామని అగ్నిమాపక అధికారి ఎంవి సుబ్బారావు తెలియచేసారు.





Total views : 140855