మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు ఎంతగానో లబ్ధి పొందారని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక పరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ఆర్టీసీ సమర్థవంతంగా అమలు చేస్తుందని, సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ నెల 20 వరకు రూ.111 కోట్ల జీరో టిక్కెట్లను సంస్థ జారీ చేసిందని, ఫలితంగా ఫ్రీ బస్సు ద్వారా మహిళలకు 3747 కోట్ల ఆదాచేసుకున్నారని మంత్రి వెల్లడించారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన టికెట్ల రీయింబర్స్‌మెంట్‌ను ఆర్టీసీకి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్‌గా…
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్‌ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141435