Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Telangana ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదా

ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదా

by Rama
ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదా

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు ఎంతగానో లబ్ధి పొందారని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మ‌హాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ సౌక‌ర్యం, కొత్త బ‌స్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక ప‌ర‌మైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను ప‌వ‌ర్ పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివ‌రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ఆర్టీసీ సమర్థవంతంగా అమలు చేస్తుందని, సంస్థలో ప్రతి ఒక్క సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ నెల 20 వ‌ర‌కు రూ.111 కోట్ల జీరో టిక్కెట్లను సంస్థ జారీ చేసింద‌ని, ఫ‌లితంగా ఫ్రీ బస్సు ద్వారా మ‌హిళ‌లకు 3747 కోట్ల ఆదాచేసుకున్నార‌ని మంత్రి వెల్లడించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కానికి సంబంధించిన టికెట్ల రీయింబ‌ర్స్‌మెంట్‌ను ఆర్టీసీకి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: