చిత్తూరు జిల్లా, పుంగనూరు సోమల (మం)లో అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీ బాల రాముని కి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమల మండలం లో భక్తులు శోభ యాత్ర నిర్వహించారు. పుంగనూరు బిజెపి ఇంచార్జి మదన్ మోహన్ మాట్లాడుతూ జైశ్రీరామ్ హిందూ బంధువులందరికి ఈ రోజు దీపావళి పండుగ రోజు అని అన్నారు. 450 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హిందూ బంధువులందరికీ అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట శ్రీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నిర్వహించడము పై యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ప్రతి ఒక్క హిందువు దేవాలయంలో గాని తన ఇంట్లో ఉన్న పూజ గదిలో గాని అక్షింతలు హోమాలు చేసి శ్రీ.సీతా రాముల కృప పాత్రకు కావాలని కోరారు. సోమల లోని శ్రీరాముని గుడిలో శ్రీ సీతా రాముల కువేద పండితులు చే పూజలు నిర్వహించారు. సోమల బస్ స్టాండ్ నుండి శ్రీ రాముల గుడి దగ్గర నుండి భక్తులు ర్యాలీలో బయలుదేరి జైశ్రీరామ్ అంటూ రామా రామా రఘుపతి రామా అంటూ భక్త పరవశంలో మునిగితేలిన నినాదాలు చేసుకొని వెళ్లిన భక్తులు. అంతే కాకుండా అన్నదానం మరియు రామకోటి ,రాత్రి కి శ్రీ సీతారాముల పల్లకి లో గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
narendra modi
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు జరిగే కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 11 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఆడియో మెసేజ్ ను పోస్ట్ చేశారు. తన జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానని ప్రధాని చెప్పారు. తొలిసారి ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నానని తెలిపారు. శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్టను వీక్షించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మన గ్రంథాలు చెపుతున్నట్టు భగవంతుడి యజ్ఞం కోసం, ఆరాధన కోసం మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని మేల్కొల్పాలి. దీని కోసం మనం పాటించాల్సిన కఠినమైన నియమాలను మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నాకు సాధువులు సూచించిన ప్రవర్తనా సూత్రాల ప్రకారం ఈరోజు నుంచి 11 రోజుల పాటు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నానని మోదీ చెప్పారు. ఎన్నో తరాలు కలలుగన్న సమయం ఆసన్నమయిందని మోదీ అన్నారు. ఆ భగవంతుడే తనను భారతీయుల ప్రతినిధిగా చేశాడని చెప్పారు. తాను ఒక సాధనం మాత్రమేనని, ఇది ఒక పెద్ద బాధ్యత అని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులు తనకు కావాలని చెప్పారు.
Read Also..
బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తాను. మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం. ఇలాంటి జాతర కి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది. కానీ ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ప్రజలందరూ కలిసి సమ్మక సారలమ్మ జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇచ్చేదాకా పోరాటం చేయాలి. ఈరోజు వరంగల్ నుండి బిజెపి పార్టీ నాయకులకి, నరేంద్ర మోడీకి తెలియజేయడం జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మ జాతరకి స్టేట్స్ ఇవ్వాలి అని, ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతర కు 100 కోట్లు ఇచ్చాము. బస్ ఫ్రీ అన్నప్పటి నుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పురుషులకి ప్రత్యేక బస్సులు, స్త్రీలకు ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలి. ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి. ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండవు, రాజకీయంలో గెలుపు ఓట్లములు సహజం. ప్రజలకు ఆసౌకర్యo కలగాకుండా 2000 ల పెన్షన్ వచ్చే వారికి 4000 ల పెన్షన్ పెంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వమిచ్చిన ఈ పథకాలపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి అనేది ఇస్తాం అన్నారు, కానీ వారు ఇచ్చిన ఆ గ్యారంటీ పధకాలలో ఎక్కడ ఆ కాలం కనిపించడం లేదు, యువకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పై ప్రజలు కొన్ని విషయలలో అయోమయం లో ఉన్నారు. ప్రజలను కష్ట పెట్టడం తప్ప ఈ పధకాలు అన్ని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, మీ సెవా లో ఒక బటన్ ఒత్తుతే పూర్తి వివరాలు వస్తాయి కానీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో ప్రజల ఆలోచించాలి.
నరేంద్రమోదీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లోకి ఇటీవల అగంతుకులు వచ్చి సభ్యులపై టియర్ గ్యాస్ వదిలిన ఘటనపై స్పందిస్తూ ఈ అంశం మన దేశ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఓ బీజేపీ ఎంపీ సిఫార్సు వల్లే నిందితులకు పాస్‌లు వచ్చాయని, వారిని కాపాడేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్ భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో పర్యటించనున్నారు. ఈరోజు కాశీ పర్యటనలో నాడేసర్ లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రాంభిస్తారు. రేపు విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రాంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాధం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోధీ బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్ తో సహా ఐదు రైళ్లును ప్రారంభించనున్నారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీ ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్లో ప్రదర్శించొద్దు అని మోదీ కాంగ్రెస్‌కు హితవు పలికారు.శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మీడియాతో మాట్లాడారు. గత 9 ఏళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం ఉండదని రుజువైందని ప్రధాని స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షోతో తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చిందని నేతలు భావిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిజెపి సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని డోర్నకల్ మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు భూక్యా సంగీత, జాటోత్ హుస్సేన్ నాయక్ ల ను గెలిపించాలని ప్రజలకు సూచించారు. కాగా ఈ వేదికపై ఆసక్తికర సన్నివేశం నెలకొన్నది.
ప్రధాని మోదికి డోర్నకల్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిని భూక్యా సంగీత గిరిజన సాంప్రదాయ ఆభరణాలను అందించారు. తదుపరి ప్రధాని కాళ్లకు సంగీత నమస్కరించారు. ఇది సాధారణంగా ప్రతి వేదికలపై జరిగే విషయమే కానీ దేశ అత్యున్నత స్థానమైన ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ అతి సాధారణ మారుమూల గిరిజన తండాలో పుట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిని పాదాలకు తిరిగి నమస్కరించారు. కాగా ఈ సన్నివేశం సభలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ ప్రథమ పౌరుడైన మహిళల పట్ల ఇచ్చే అత్యున్నత గౌరవం భాజపాకు మాత్రమే సాధ్యమవుతుందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
Read Also
బెంగుళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఇవాళ తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన తేజస్‌లో ఆయన ట్రిప్ వేశారు. బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని ఆయన విజిట్ చేశారు. రకరకాల ఫైటర్ జెట్ల తయారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తేజస్ తయారీ గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉన్నది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థతో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. తేజస్ విమానాలకు చెందిన మాక్-3 ఇంజిన్లను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేస్తోంది. తేజస్ యుద్ధ విమానంలో సక్సెస్‌ఫుల్‌గా ఎగిరినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని పోస్టు చేశారు. అనుభూతి అద్భుతంగా ఉందన్నారు. స్వదేశీ సామర్థ్యాన్ని పెంచాలన్న తన నమ్మకానికి బలం చేకూరినట్లు ఉందన్నారు. భారత సత్తా పట్ల గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. నగరంలో ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ శనివారం సాయత్రం 5:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వై జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా ప్రధాని రాజ్‌భవన్ చేరుకోనున్నారు. దీంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక 26న ఆదివారం ఉదయం 10:35 – 11:05 మధ్య ప్రధాని రాజ్‌భవన్ నుంచి ఎంఎంటీఎస్, యశోద ఆసుపత్రి, బేగంపేట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్రాఫిక్ దారి మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని హైదరాబాద్ పోలీసులు సూచించారు. ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జీ.సుధీర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు.





Total views : 141264