అనంతరం గజ్వేల్ నుండి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో చేసుకున్నాం రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము. కెసిఆర్ కు ఓటు వేసి రుణ తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ గారికి రాబోతున్నది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతాం. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారు. కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే కెసిఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్ళు ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కెసిఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్ళు, సాగు నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేసస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బిఆర్ఎస్ కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది.
pawan kalyan
బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ కల్యాణ్.. సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. జల్… జంగల్… జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినాదాలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్, తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు.తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ… 8 స్థానాలను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే, హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది. బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఉంటూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ ఆయనను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
నటుడు వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7.18 గంటలకు వీరి వివాహం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు. దీంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఘనంగా జరిగిన పెళ్లి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన అగ్ర హీరోలు సందడి చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవ దంపతులను ఆశీర్వదించార. ఇక సినిమా పరిశ్రమ, సెలబ్రిటీల కోసం నవంబర్ 5న హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు. మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరగనుంది.




Total views : 140797