Road Accident
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నిరంపల్లె గ్రామ జాతీయ రహదారిపై తెల్లవారుజామున చెప్పుల లోడు తో వెళుతున్న బొలెరో వాహనం లారీని ఢీకొంది. దీంతో బొలెరో వాహనం లో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరో వాహనం డ్రైవర్ మంటల్లో నుంచి దూకి పరారయ్యాడు. బొలోరో క్లీనర్ కు లారి లోని ఇంకొక డ్రైవర్ కు వారిద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో జిల్లాప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డి.ఎస్.పి, సిఐ ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు నుండి కోల్కతా ఉల్లిగడ్డలోడు తో వెళ్తున్న లారీని విజయవాడ నుండీ అనంతపురం వెళ్తున్న చెప్పుల లోడు తో వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం మండలం తాటికల్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. మృతులు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. ఏలూరు నుండి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి వీరు కారు ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఘటన స్థలంలో ఎమ్మెల్సీ మృతిచెందగా సీసీకి, గన్మెన్ కి గాయాలయ్యాయి. భీమవరం వర్మ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకోనున్నారు.
Read Also..
పలమనేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న కరెంటు ఫోల్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు. ఢీకొని రంగబాబు వరకు ఈడ్చుకొని వెళ్లిన వైనం, ఆ సమయానికి అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది వెంటనే నష్ట నివారణ చేపట్టి కరెంటును పునరుద్ధరించారు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన వైనం. తాడేపల్లిగూడెం నుండి గుంటూరు వైపు వెళ్లే తరుణంలో చిన్న అవుటపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు గుంటూరు వాసులుగా కార్తీక్ (19) వెంకట్ (30)గా గుర్తింపు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు సమీపంలోని చిన్న అవుటపల్లి పిన్నమ నేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది రోడ్డుపై ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయం తో సమాచారం అందుకున్న ఆత్కురు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ముగ్గురికి గాయాలు. శబరిమలై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న టెంపో ముందు వెళ్తున్న ఆటోను డీ కొట్టడంతో జరిగిన ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిల్లకూరు పోలీసులు….
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి.కోట,నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి, పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కారు ఢీకొనడంతో మృతి చెందాడని, పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ చదువుతున్న పవన్ (17) అక్కడికక్కడే మృతి చెందగా.. రోహిత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారని స్థానికులు తెలిపారు. అగ్రహారానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. అతివేగంగా వెళుతూ బైక్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్లు ఆనవాల్లు ఉన్నాయి. మృతుని తల్లిదండ్రులు శ్రీశైలం తీర్థయాత్రకు రాత్రి వెళ్లారు. పవన్ సోదరి కన్నీటి పర్యంతమవుతా శోకసముద్రంలో మునిగిపోయింది. క్షతగాత్రుని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.





Total views : 141224