పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైయిన్ కాలనీ లోని సింగరేణి మైన్స్ రెస్క్యూ ప్రదాన కార్యాలయంలో 52 వ ఆలిండియా మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలను భారత బొగ్గుగనుల భద్రతా విభాగం అదికారి శ్యామ్ మిశ్రా ముఖ్య అతిధిగా హాజరై ప్రారంబించారు. పోటీలలో దేశంలోని కోల్ మైన్స్ కు చెందిన 16 జట్లు, మెటల్ మైన్స్ కు చెందిన 9 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా డిఎంఎస్ శ్యామ్ మిశ్ర మాట్లాడుతూ దేశంలోని అన్ని కోల్ మైన్స్, మెటల్ మైన్స్ కు చెందిన రెస్క్యూ బృందాలు ఈ పోటీలో పాల్గొంటున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో అప్రమత్తత కోసం ఏటా దేశంలోని ఒక సంస్థలో ఆలిండియా రెస్యూ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం హిందుస్థాన్ జింక్ సంస్థ నుంచి మహిళా జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు.
Singareni
ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటియూసికే దక్కిందని అన్నారు. సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి. ఎల్లయ్య, బ్రాంచి అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులు, ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వ బోమని సింగరేణి అంటే సింహగర్జన అని, అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి సంస్థ పురోగమనానికి టీబీజీకేఎస్ గెలుపు చాలా అవసరమన్నారు. సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో బొగ్గు గని కార్మికులు ముఖ్య పాత్రను పోషించారని ప్రశంసించారు. సింగరేణి కార్మికులకు ఉన్న పోరాట స్ఫూర్తి జాతీయ సంఘాలకు లేదన్నారు. బొగ్గు గనుల్లో కార్మికుల కష్టం తెలంగాణలో వెలుగులు నిండేందుకు కారణమవుతుందన్నారు.
ఈనెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే 2ఏ బొగ్గు గనిపై అర్జీ1 నాయకులు హరిన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ.. గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు బిఎంఎస్ కృషి చేస్తుందని అన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని 27న జరిగే గుర్తింపు ఎన్నికల్లో “కాగడా” గుర్తుకు ఓటు వేసి బిఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే రెండవ బొగ్గు గనిపై సీఐటీయు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కల తో పాటు వృత్తి పన్ను రద్దు చేస్తామన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల అపరిస్కృత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. ‘ఉదయించే సూర్యుడు’ గుర్తుపై కార్మికులు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
రామగుండం ఏరియా సింగరేణి బొగ్గుగనుల పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజయం సాదించిన సందర్బంగా కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యు సి కార్యకర్తలు బొగ్గు గనులపై సంబరాలు చేసుకున్నారు.
రామగుండం రీజియన్ జిడికే 2వ బొగ్గుగని పై టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెంచాల. తిరుపతి మాట్లాడుతూ గత పాలకులు సింగరేణి నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కార్మికుల హక్కుల పరిరక్షణ తో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపుకు సహకరించిన కార్మికుల ఈసందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
రామగుండం సింగరేణి ఏరియా వన్ జీడికే లెవెన్ ఇంక్లైన్ బొగ్గు గనికి వెళ్లే పాత రహదారిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉదయం షిఫ్టులో కార్మికులు గని వద్ద నిరసన దిగారు .కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో గనికి చేరుకునే అవకాశం ఉన్న రహదారిని మూసివేయగా 11 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు.గతంలో ఫైవింక్లైన్ నుంచి ఉన్న రహదారిని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తూ గని వద్ద బైటాయించారు.
సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని, సింగరేణి కార్మికులను బార్డర్లో పనిచేసే సైనికులగా గౌరవిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ రామగుండం అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. సింగరేణి కార్మికుల దీవెన యాత్రలో భాగంగా జీడికే టు ఎ బొగ్గు గని పై ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని రాబోయే ఎన్నికల్లో బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని కార్మికులను కోరారు. అనంతరం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని కలిసి తనకు ఈసారి ఎన్నికల్లో అవకాశం కల్పించాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
intuc కాంపల్లి సమ్మయ్య- సింగరేణి నష్టాల బాటలో పయనించేలా చేసింది కెసిఆర్…
మంచిర్యాల జిల్లా మందమర్రి
సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయుటకు బిజెపితో చేతులు కలిపి టిఆర్ఎస్ నీ బిఆర్ఎస్ గా మార్చి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీసిందని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం కోన సాగిస్తున్నామని బుధవారం మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో intuc నాయకులు కాంపల్లి సమ్మయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. తెలంగాణ వస్తే మన పరిపాలన మనమే చేసుకుంటాం మన నిధులు ఉద్యోగాలు మనకే వస్తాయి అని చెప్పిన టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ గా మార్చి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. సింగరేణిలో బొగ్గు గని కార్మిక సంఘం గెలిస్తే సింగరేణి కార్మికుల ఇళ్లను దివ్య కాంతులుగా వెలిగిస్తాం సింగరేణి కార్మికుల కుటుంబల పిల్లల భవిష్యత్తును మారుస్తానని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని సింగరేణి ఆదాయాన్ని రెండువేల కోట్లు వాడుకొని సింగరేణి నష్టాల బాటలో పయనించేలా కెసిఆర్ చేశారని మండిపడ్డారు అక్కడ కెసిఆర్ ఇక్కడున్నటువంటి బాల్క సుమన్ ని ఇంటికి పంపించేదాకా ఊరుకునేది లేదని ముక్తకంఠంతోని నినాదం చేస్తూ ప్రజలు ఏకమై వస్తున్నార ఎక్కడ కూడా దందాలు చేసి డబ్బులు సంపాదించలేదు ప్రజలకు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన వారు ముందుండి సమస్యను తీరుస్తారని సూచించారు.వీరిద్దరు స్థానికులే గత 50 సంవత్సరాల నుండి కాక వెంకటస్వామి చెన్నూర్ని అదేవిధంగా పెద్దపెల్లి పార్లమెంటు సభ్యునిగా ఉండి అభివృద్ధి పదంలో నడిపించారానారు. అదేవిధంగా వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ ను తీసుకొచిన్న ఘనత వారిది నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇసుక బొగ్గు బు దండాలు పాల్పడుతున్నారని కోట్లు సంపాదించిన వ్యక్తి కి ప్రజలు బుద్ది చేపి తరిమివేయాలని ఎన్నికలలో కాంగ్రెస్ కు అభ్యర్థి వివేక్ భారీ మెజార్టీ తో గెలిపించలని ఐఎన్టీయూసీ యూనియన్ కోరారు .
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర HMS అధ్యక్షుడు, యూనియన్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి హక్కులను కాపాడడంలో HMS ఎప్పుడు ముందుంటుందని అన్నారు. యూనియన్ ఉద్యమాల ద్వారా ఈ దవాఖన నిర్మితమైనదని, కానీ ఇప్పుడు దావాఖనాలన్ని రాజకీయాల కబంధ హస్తాలలోకి వెళ్ళిపోయి నాశనం అయ్యాయన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కన్నా ఏరియా ఆసుపత్రి చాలా పెద్దదని, ఇటు వంటి ఆసుపత్రిని ఆధునీకరించి, సరిపడా వైద్యులను నియమించాలని తెలిపారు. ఎంతో కృషి చేసి గోదావరిఖని నుండి గైనకాలజిస్టు ను ఇక్కడ నియమించడం జరిగిందని, కానీ గైనకాలజిస్టు కు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆపరేషన్లు చేయలేకపోతుందని, ఆసుపత్రిలో సరిపడా స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సులు, ఆయాలు, టెక్నిషియన్స్ లేరని, మందులు కూడా సరిగ్గా రావడం లేదని, ఈ ఆసుపత్రి కేవలం రెఫరల్ దవాఖాన గా మారిపోయిందని, ఆరోగ్య సమస్యలతో వచ్చిన కార్మికులను మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారని, దీనికి ముగింపు పలుకుతూ ఇక్కడ సమస్యల్ని తీర్చాలని డిమాండ్ చేశారు. సింగరేణి డిక్లరేషన్ ప్రకటించిన తరువాతే ఏ రాజకీయ పార్టీ నాయకులైన కార్మికులను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
Read Also..



Total views : 149833