శ్రీశైలంలో వచ్చేనెల 6 నుంచి 10 వరకు 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు దేవస్థానం పరిపాలన భవనంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు దేవస్థానం అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషి చేయాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లకు సంబందించిన అంశాలను చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీచేశారు. అధికారులందరు పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అదేవిధంగా క్షేత్రానికి వారం రోజుల ముందు నుండే కర్ణాటక, మహారాష్ట్ర కన్నడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, పాదయాత్ర మార్గంలో విచ్చేసే కన్నడ భక్తులకు భీమునికొలను కైలాసద్వారం అలానే అటవీ మార్గంలో వేయి లీటర్ల సింటెక్స్ ట్యాంకులు 8 ఏర్పాటు చేయాలని కన్నడ భక్తులకు ఎంటుంటి అసౌకర్యం కలగకుండా నీటి కోసం ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అలానే క్షేత్రపరిదిలో భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతి, త్రాగునీరు, విశ్రాంతి సెమియనలు ఏర్పాట్లు చేయాలని కన్నడ భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిదిలో పలు సమాచార కేంద్రాలు, కన్నడ భాషలో సూచిక బోర్డ్స్ పెట్టాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లన్ని ఈనెల 29 లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు.
Srisailam
శ్రీశైలం(srisailam)
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఘనంగా ముగిశాయి చివరి రోజైన నేడు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి అశ్వవాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నులపండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ఈపూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. వాహనపూజలనంతరం
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో(Mahashivratri Brahmotsavam) ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణం శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో శ్రీస్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించి 9 రకాల ఫలాలు నివేదించబడ్డాయి. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. ఈ శయనోత్సవానికి ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల శయనమందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంతసేవ నిర్వహించారు. ఈపూజ కైకర్యాలతో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటితో ఈఏడాది శ్రీస్వామి అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో పదోవరోజైన ఈ రోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి వారి యగశాలలో చండిస్వారస్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన ,త్రిశూలస్నానం, జరిపారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తరువాత శ్రీచండీశ్వరస్వామిని పల్లకిలో ఆలయ మాడ వీధి గుండా ఆలయ పుష్కరిణి వద్ద తోడ్కొని వచ్చి చండీశ్వరస్వామికి వైదిక శాస్త్రంగా అవభృధస్నానం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో రేపటితో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
శ్రీశైలంలో తొమ్మిదవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి. అశేష జనవాహిని మద్య శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీస్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమ్రోగాయి ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించి పోయారు. ముందుగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీస్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద ఉన్న రధాశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం రథానికి రధంగా పూజలు, రధంగా హోమం, రధంగా దేవత బలిసమర్పణ తదితర పూజలు నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లు రధోత్సవానికి సిద్ధమయ్యారు. అశేష జనవాహిని మద్య రథోత్సవం కధలగానే వేలాదిమంది భక్తులు ఓం నమః శివాయ నినాదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించి పోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు, అరటిపండ్లను రధంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు, ట్రస్ట్ సభ్యులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన శివస్వాములు, సాధారణ భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు. నల్లమల అంత ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. శివరాత్రి సమీపిస్తుండటంలో రాయలసీమ, కోస్తా, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుండి మహిళలు, వృద్ధులు, చిన్నారులు మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని భక్తులంటున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే శివస్వాముల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి శివస్వాములు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న భక్తుల కోసం దేవస్థానం అధికారులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుండి వచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారని పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం వచ్చే భక్తులకు మార్గమధ్యలో అన్నదాన ఏర్పాటు చేశారు. వెంకటాపురం నుండి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటు వస్తున్న పాదయాత్ర భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు భక్తులు, శివస్వాములు అంటున్నారు.
ఇది చదవండి: రౌడీ షీటర్ బర్త్ డే వేడుకలకు అడ్డాగా పోలీస్ ఠాణా..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగోవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామి మయురావాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు,వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయురావాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివేళ్ళగా రాజగోపురం నుండి మయురావాహనాదీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారించేందుకు మయురావాహానంపై శ్రీస్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహనసేవ పూజ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, చైర్మన్ చక్రపాణి రెడ్డి, ట్రస్ట్ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి(Mahashivratri) బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు,ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ద్వజపటావిస్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ద్వజస్దంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానించారు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేదమంత్రోచ్ఛారణలతో ఆహ్వానించిన శివరాత్రి ఫెస్టివల్ ఆఫీసర్, దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శివరాత్రి బ్రహ్మోత్సవాల ధ్వజపటన్ని ఆవిష్కరించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేది నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యంగా మార్చి 1 వతేది నుండి 11 వతేది వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుండి 5వ తేదీ సాయంత్రం 7:30 వరకు నిర్దిష్టవేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. 5 వ తేదీ సాయంత్రం 7:30 నుండి 11 వతేది వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర,అతి శీఘ్రదర్శనానికి ఆన్లైన్,కరెంట్ బుకింగ్ కి ఏర్పాటు చేశామని భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.
శ్రీశైలం – మహా కుంబాభిషేకం Maha Kumbabhishekam
శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన మహా కుంబాభిషేకం (Maha Kumbabhishekam) ఆగమ శాస్త్రను సారం ప్రారంభమైన మహాకుంభాభిషేకం నేటి నుంచి ఈనెల 21 వరకు ఆరు రోజులపాటు ఆలయంలో మహాకుంభాభిషేక నిర్వహించనున్న దేవస్థానం అధికారులు మొదటి రోజులో భాగంగా నేడు ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ప్రధాన ఆలయంలోని గర్భాలయం చుట్టూ ప్రదక్షణ చేసి అనంతరం వేదమంత్రాలు మధ్య శ్రీస్వామివారి యాగశాల ప్రవేశం చేసి మహాగణపతి పూజతో మహా కుంభాభిషేకానికి మంత్రి దంపతులు శ్రీకారం చుట్టారు అనంతరం రుత్వికులు లోక కళ్యాణం కాంక్షిస్తూ సంకల్పాన్ని పాటించి గోపూజ,గణపతిపూజ,దీక్షాధారణ,పారాయణలు,అఖండదీపస్థాపన నిర్వహించారు అలానే సాయంత్రం మృత్సంగ్రహణము, అంకురార్పణ, జలాధివాసం, వేదస్వస్తి, మంత్రపుష్పం నిర్వహించనున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
నేడు ప్రారంభమైన కుంభాభిషేకం 21వ రోజు ప్రధాన ఘట్టం కాగా అదే రోజు ఎప్పటి నుండి పునర్నిర్మించి శివాజీ గోపురానికి కలిశా ప్రతిష్ట నిర్వహించి మహాకుంభాభిషేక కృతువులను జరిపించనున్నారు. వీటితోపాటు ఉభయ ఆలయాల్లో ఉన్న ఉపాలయాలను అలానే పరివార ఆలయాలలో భాగమైన పంచ మఠాలలో మూడు మటాలకు లింగాలను నందీశ్వరులను ప్రతిష్ట చేసి మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. మొదటి రోజు ప్రారంభ పూజలకు శ్రీశైలం జగద్గురు 1008 చిన్న సిద్ధ రామ శివాచార్య మహాస్వామిజి కూడా హాజరయ్యారు నేటి నుండి 21 వరకు ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించనున్నారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SriSailam:
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్లంజ్‌పూల్ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందన్నది ప్రశ్నార్థకమైంది. జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి (ప్లంజ్‌పూల్) ఏర్పడింది. దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చకపోతే పెనుముప్పు తలెత్తే ప్రమాదముందని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రతపై ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లుగా స్పందించ లేదు. సంక్లిష్టమైన ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకే సుమారు రూ.15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దేశంలోని పలు పరిశోధన సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించాలి. అన్ని బృందాల నిపుణులు ఇచ్చిన నివేదికల్లో ఉత్తమమైనది ఎంపిక చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం కనీసం ఒక్క నిపుణుల బృందంతోనూ అధ్యయనాన్ని ప్రారంభించలేదు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.by CVR NEWSఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.by CVR NEWSఅమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్by CVR NEWSక్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…






Total views : 141307